Dude: ఈసారి 'డ్యూడ్'తో వస్తున్న ప్రదీప్.. వైరలవుతున్న కొత్త సినిమా పోస్టర్

'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే #PR04 అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమూవీ టైటిల్ ప్రకటించారు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'డ్యూడ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

New Update

యంగ్ ప్రదీప్ రంగనాథన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్ చేశారు. ఇటీవలే #PR04 అంటూ పూజ కార్యక్రమాలతో లాంచ్ చేసిన ఈ చిత్రానికి  'డ్యూడ్'  అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. మైత్రి మేకర్స్ నేరుగా తమిళ్ లో ప్రొడ్యూస్ చేస్తున్న రెండవ  చిత్రమిది. 

మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ 

డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. ద్రవిడ్ సెల్వం, శరత్ కుమార్, హృదు హరూన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమాకు సాయి అభ్యాంకర్  సంగీతం అందిస్తుండగా..  నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు