Lovedale Movie: ఈ వీకెండ్ కి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెగ హడావిడి చేసాయి. దాదాపు 25కి పైగా కంటెంట్ యూజర్ల ముందుకొచ్చింది. కొన్ని చిత్రాలు ముందుగా అనౌన్స్ చేయకుండా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అలాంటి చిత్రాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది ‘లవ్ డేల్’ అనే మిస్టరీ-హారర్ థ్రిల్లర్.
Also Read: ఇలా ఉన్నారేంట్రా అయ్యా..! 'యమదొంగ' రీ-రిలీజ్ లో అలీ గెటప్ రీ క్రియేట్ చేసి రచ్చ రచ్చ..
ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు పలు భాషల్లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వచ్చింది. మలయాళ భాషలో విడుదలైనప్పటికీ ఇప్పుడు ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
'లవ్ డేల్' అంటే ఏంటి?
'లవ్ డేల్' అనేది ఊటీలోని ఒక ఊరి పేరు. అక్కడి ప్రకృతి సౌందర్యం, మిస్టీరియస్ వాతావరణం సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది.
కథలోకి వెళితే
ఓ మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ తన స్నేహితులతో కలిసి ఆ ఊరికి ట్రిప్‌కు వెళ్లుతుంది. వారు ఓ పాత బంగ్లాలో తాళం వేసి నివాసముంటారు. మొదటికి సరదాగా ప్రారంభమైన ఈ ట్రిప్, కొద్ది రోజులకే వారిని కలవరానికి గురి చేస్తుంది. ఒక్కొక్కరుగా గ్రూప్‌లోని సభ్యులు అనూహ్యంగా మృత్యువాత పడటం మొదలవుతుంది.
Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!
అసలు ఏం జరుగుతోంది?
ఎవరూ ఊహించని విధంగా ఈ మరణాలు జరగడంతో, ఈ హత్యల వెనుక ఏముంది? వారిని చంపుతున్నది ఎవరు? అది మానవ ప్రయత్నమా లేదా ఏదైనా దుష్ట శక్తి పనిచేస్తుందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతాయి. చివరికి ఈ రహస్యాన్ని వీరు ఎలా ఛేదించారన్నదే క్లైమాక్స్‌లో తెలుస్తుంది.
Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..
ఎక్కడ చూడచ్చు?
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో యూకేలో స్ట్రీమింగ్‌లో ఉంది. త్వరలోనే ఇది మన దేశంలోని ప్రైమ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి రానుంది. కాస్త భయాందోళన కలిగించే థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి ‘లవ్ డేల్’ ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ముఖ్యంగా కొత్త నటీనటుల పెర్ఫార్మన్స్, కథనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సస్పెన్స్, హారర్ కలయికగా వచ్చిన ఈ కథను ఓసారి తప్పకుండా చూడొచ్చు.