/rtv/media/media_files/2025/05/29/Qlr3PDePAQkWQ4eojIFv.jpg)
అయితే డైలీ డైట్ లో కొన్ని ఆహారపు అలవాట్లు చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/03/04/GzcTIdHb1jJ2y1DisilB.jpg)
ముఖ్యంగా నాలుగు పండ్లను తీసుకోవడం మరింత సహాయపడుతుంది.
/rtv/media/media_files/2024/11/08/orange5.jpeg)
నారింజ, ద్రాక్షపండు, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లలో పెక్టిన్ అనే సోలబుల్ ఫైబర్ చెడు" LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి.
/rtv/media/media_files/2025/01/26/eMZMu9jtXgzeMSu2s9dO.jpg)
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ఆపిల్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది. ఆపిల్స్‌లో ఉండే పాలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలను రక్షించడంలో సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/02/26/avocado4-337192.jpeg)
అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవకాడోలలో ఉండే మంచి కొవ్వులు HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి , LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
/rtv/media/media_files/2025/01/14/bcdnIddIQJMWDxREjhLr.jpeg)
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అరటిపండ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అరటిపండ్లలో ఉండే సోలబుల్ ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్తో కలిసి శరీరంలో కొలెస్ట్రాల్ ను నిరోధించడానికి పనిచేస్తాయి.
/rtv/media/media_files/2025/03/15/sX1HIi9bTZZNdD3aWHBw.jpg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.