Raj Tarun – Lavanya: వాళ్లు నా ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారు...లావణ్య సంచలనం!

నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనపై దాడి చేసిన వారిలో కొంతమంది తన ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారని..  గొంతు పిసికారని...సినిమాలో కూడా ఇలాంటి దారుణాలను  తాను చూడలేదంది లావణ్య

New Update
lavanya-case raj tarun

lavanya-case raj tarun

హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. లావ‌ణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వ‌దిలి వెళ్లాల‌ంటూ రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రులు బుధ‌వారం ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో దాదాపుగా 15 మంది తనపై దాడికి దిగారంటూ లావ‌ణ్య  గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.  కోకాపేటలోని తన ఇంటి వద్ద జరిగిన గొడవపై లావణ్య, నార్సింగి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు 15 మందితో తనపై దాడి చేసి  ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారని ఆమె ఫిర్యాదులో ఆరోపించింది.  

లావణ్య సంచలన ఆరోపణలు

నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లేముందు లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనపై దాడి చేసిన వారిలో కొంతమంది తన ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారని..  గొంతు పిసికారని...సినిమాలో కూడా ఇలాంటి దారుణాలను  తాను చూడలేదంది లావణ్య. సీసీఫుటెజ్ వీడియోలను మీడియాకు కూడా రిలీజ్ చేస్తామని లావణ్య చెబుతోంది. ఈ దాడిలో తన రెండు ఫోన్లు కూడా పోయాయని లావణ్య అంటోంది.  రాజ్ తరుణ్ వేసిన కుక్క బిస్కెట్లు తిన్న కుక్క శేఖర్ బాషా ఇదంతా  వెనుకుండి నడిపిస్తున్నాడని లావణ్య ఆరోపించింది.  రాజ్ తరుణ్ వచ్చి సెటిల్ చేస్తే తాను ఇక్కడినుంచి వెళ్లిపోతానని లావణ్య అంటోంది.  

రాజ్ త‌రుణ్ తాను క‌లిసి ఈ ఇల్లు కొన్నామని లావణ్య అంటోంది.. ఇల్లు కొన్నప్పుడు తాను రూ.70 ల‌క్షలు రాజ్ త‌రుణ్‌కి ఇచ్చినంది. తాము ఇల్లు కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమేనని..  ఇప్పుడది ఏకంగా రూ.12 కోట్లకు పెరిగిందంది.  తనతో 11 ఏళ్ల పాటు రాజ్ త‌రుణ్ లివ్ ఇన్ రిలేష‌న్‌ లో ఉన్నాడని..  త‌న‌తో ఉంటాడ‌ని నమ్మి అతనికి తన జీవితం మొత్తం స‌మ‌ర్పించానంటుంది లావణ్య.. తన దగ్గరున్న మొత్తం డబ్బులు అతడికే ఇచ్చానని.. అత‌డి పేరెంట్స్ వ‌చ్చి ఇల్లు త‌మ‌ద‌ని అంటున్నారంది.  ఇంటికి సంబంధించి రాజ్ తరుణ్ కు ఎంత హ‌క్కు ఉందో తనకుఅంతే హక్కు ఉందని లావణ్య చెబుతోంది.  తాను అస‌లు రాజ్ త‌రుణ్ తల్లిదండ్రులను ట‌చ్ కూడా చేయాలేదని..  వాళ్లే ఇంట్లోకి వ‌చ్చి వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారని ఆరోపించింది. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారంటూ లావ‌ణ్య వాపోయింది.  రాజ్ తరుణ్ ను వోదిలేస్తే డబ్బులిస్తామని అతని పేరెంట్స్ అంటున్నారని లావణ్య ఆరోపించింది.  

Also read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు