టాలీవుడ్ లో మరో టాలెంటెడ్ హీరో.. ఫస్ట్ మూవీతోనే అదరగొట్టేలా ఉన్నాడుగా !

టాలీవుడ్ లో యంగ్ హీరో రాజేష్ మేరు తన టాలెంట్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఇతను హీరోగా 'లగ్గం టైమ్' అనే సినిమా తెరకెక్కింది. నవంబర్ 17న ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్‌ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

raj (1)
New Update

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొందరు తమ టాలెంట్ తో సక్సెస్ అవ్వగా.. మరికొందరు సక్సెస్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీకి మరో హీరో తన టాలెంట్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. అతనే యంగ్ హీరో రాజేష్ మేరు. ఇతను హీరోగా 'లగ్గం టైమ్' అనే సినిమా తెరకెక్కింది. 

కొత్త నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలా బజ్ క్రియేట్ చేస్తోంది.  ప్రజోత్ కె వెన్నం ఈ సినిమాకి కథ అందించడమే కాకుండా దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. నవ్య చిత్యాల హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్ గానే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర లాంచ్ చేశాడు. అప్పట్నుంచి ఈ సినిమాలోని హీరో బాగా హైలైట్ అవుతున్నాడు. 

Also Read : ఇకపై అలాంటి పాత్రలు అస్సలు చేయను.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్

ఆరడుగుల ఎత్తు, ఎత్తుకు తగిన అందం, హీరోకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఇతనికి ఉన్నాయి. రాజేష్ మేరు తన మొదటి సినిమాలో సూర్య పాత్రలో కనిపించనున్నాడు. ట్రెడిషనల్, వింటేజ్ లుక్స్ లో ఈ నటుడు చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. నేడు అంటే నవంబర్ 17న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ ఒక స్పెషల్ పోస్టర్ స్టార్ కూడా రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అందులో రాజేష్ స్టార్ కిడ్స్ ఏమాత్రం తీసుకొని విధంగా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. టాలీవుడ్ ఫ్యాన్స్ ఈ అప్‌కమింగ్ హీరోకి బర్త్‌ డే విషెస్ చెబుతున్నారు. అంతేకాదు రాజేష్ డెబ్యూ మూవీ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కావాలని విష్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా పోస్టర్లు ఆడియన్స్ లో మంచి పాజిటివ్ వైబ్స్  క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాతో రాజేష్ మేరు హీరోగా రాజేష్ మేరు సక్సెస్ అందుకుంటాడా అనేది చూడాలి.

Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్?

#tollywood
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe