ఇకపై అలాంటి పాత్రలు అస్సలు చేయను.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్

మీనాక్షి చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇక నుంచి భార్య, తల్లి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. 'లక్కీ భాస్కర్‌’ లో భార్య పాత్రను ఎంతో ఇష్టపడి చేశాను. అయితే రానున్న కొన్నేళ్లు ఆ తరహా క్యారెక్టర్స్‌ చేయొద్దని నిర్ణయించుకున్నానని తెలిపింది.

New Update
meenakshi22

టాలీవుడ్ లో ఇప్పుడంతా అందాల బ్యూటీ మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. కాగా ఈ ఏడాది మహేష్ బాబుతో గుంటూరు కారం, దళపతి విజయ్ తో గోట్ సినిమాలతో సూపర్ క్రేజ్ అందుకుంది.

ఈ హీరోయిన్ తాజాగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం దీపావళి కానుకగా థియేటర్స్ లో రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మీనాక్షి.. దుల్కర్ సల్మాన్ కు భార్యగా హోమ్లీ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్.. ఇక నుంచి భార్య, తల్లి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.

Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్?

ఆ తరహా క్యారెక్టర్స్‌ చేయను..

' లక్కీ భాస్కర్‌’ చిత్రంలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే కొంతమంది మాత్రం కెరీర్‌ ఆరంభంలో హౌస్‌వైఫ్‌ పాత్రలు చేయకపోవడమే బెటర్‌ అని, అందుకు చాలా సమయం ఉందని సలహా ఇచ్చారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నేను ఆ క్యారెక్టర్‌ను ఎంతగానో ఇష్టపడి చేశాను. అయితే రాబోవు కొన్నేళ్ల పాటు ఆ తరహా క్యారెక్టర్స్‌ చేయొద్దని నిర్ణయించుకున్నా. 

త్వరలో నేను ఓ యాక్షన్‌ సినిమా చేయబోతున్నా. అందులో పోలీస్‌ క్యారెక్టర్‌ను పోషిస్తున్నా. కెరీర్‌లో తొలిసారి పోలీస్‌ అధికారి పాత్రను చేయడం ఎక్సైయిటింగ్‌గా అనిపిస్తోంది..' అంటూ చెప్పుకొచ్చింది. ఇక  త్వరలో ఈ ముద్దుగుమ్మ నుంచి 'మెకానిక్ రాకీ', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Also Read : పెళ్ళికి రెడీ అయిన కీర్తి సురేష్.. గోవాలో వెడ్డింగ్, అబ్బాయి ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు