రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్? రాజమౌళి, మహేష్ మూవీ నుంచి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తప్పుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. SSMB29 మూవీ కోసం తాను వర్క్ చేయడం లేదని, సినిమాలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయమని అన్నారు. By Anil Kumar 17 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శక దిగ్గజం ఎస్. ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమా 'SSMB 29' చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి దృష్టి ఈ మూవీ పైనే ఉంది. ఈ సినిమా కోసం రాజమౌళి పలు హాలీవుడ్ సంస్థలతో చేతులు కలిపారు. కాస్టింగ్ దగ్గర్నుంచి టెక్నీకల్ టీమ్ వరకు అన్నీ బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నాడు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి అండ్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. భారీ వీఎఫెక్స్ తో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే కే సెంథిల్ కుమార్ తప్పుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. రాజమౌళి - మహేశ్ బాబు సినిమా #SSMB29 నేను చేయడం లేదు....క్లారిటీ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్#SSMB29 #SSRajamouli #Mahesh #MaheshaBabu #KKSenthilKumar #MaheshBabu𓃵 pic.twitter.com/ijMCN73t1v — TeluguOne (@Theteluguone) November 16, 2024 Also Read : పెళ్ళికి రెడీ అయిన కీర్తి సురేష్.. గోవాలో వెడ్డింగ్, అబ్బాయి ఎవరంటే? అది దర్శకుడి నిర్ణయం.. ' మహేశ్ - రాజమౌళి మూవీ కోసం నేను వర్క్ చేయడం లేదు. తన సినిమాలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుడి నిర్ణయం. ఈ చిత్రానికి కొత్త టెక్నిషియన్ అయితే బాగుంటుందని ఆయన భావించి ఉండొచ్చు..' అని ఆయన అన్నారు. 'రాజమౌళితో మీ రిలేషన్ దెబ్బతిందని వార్తలు వస్తున్నాయి?' అని మీడియా ప్రశ్నించగా..' అలాంటిది ఏమీ లేదు. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒక సినిమా చేయకపోతే సంబంధాలు దెబ్బతిన్నాయని ఎలా అనుకుంటారు. గతంలోనూ మేమిద్దరం కలిసి వర్క్ చేయని సందర్భాలు ఉన్నాయి..' అని చెప్పుకొచ్చారు. కాగా రాజమౌళి డైరెక్ట్ చేసిన సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి 1, 2, 'RRR'.. దాదాపు అన్నీ సినిమాలకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. Also Read : 'కంగువా' నిజంగానే బాలేదు.. భర్త సినిమాపై జ్యోతిక రివ్యూ #s-s-rajamouli #ssmb29-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి