Aghori: హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో అఘోరి, వర్షిణి

ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అఘోరీని ఈరోజు తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూజల పేరుతో ఓ మహిళా నుంచి 10 లక్షలు కాజేసిన కేసులో అఘోరీని అరెస్ట్ చేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం చేవెళ్ల కోర్టుకు తరలించారు.

New Update

Aghori Arrest: అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ని మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో  మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన అఘోరీని.. ఈరోజు తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అఘోరీ తో పాటు అతన్ని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణిని కూడా తీసుకొచ్చారు. పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు కాజేసి..  మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు. 

చేవెళ్ల కోర్టుకు తరలింపు.. 

ఇప్పటికే అఘోరీ మోసాల పట్ల ఆధారాలను సేకరించిన పోలీసులు ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన జరిపారు. విచారణ అనంతరం నార్సింగి నుంచి చేవెళ్ల కోర్టు కు తరలించారు. ఈ సందర్భంగా అఘోరీ మీడియాతో మాట్లాడుతూ.. విచారణ సమయంలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తాను. కేసు కోర్టులో ఉన్నందున కోర్టులో తేల్చుకుంటాను. అప్పటి వరకు నా భార్య నాతోనే ఉంటుంది అని తెలిపింది. కోర్టులో హాజరుపర్చిన అనంతరం అఘోరిని రిమాండ్ కి తరలించే అవకాశం ఉందని సమాచారం. 

మహిళా ప్రొడ్యూసర్ ను చీటింగ్ 

అయితే  రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్  కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

telugu-news | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు