Kuberaa: ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో గత నెల 20న విడుదలైన 'కుబేరా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన వారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కొనసాగించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ప్లాట్ ఫార్మ్ పోస్టర్ విడుదల చేసింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది.
🚨 #Kuberaa OTT release alert! 🌟 #Dhanush, #Nagarjuna, and #RashmikaMandanna’s crime thriller will release on Amazon Prime Video, July 18! 🎥
— Bollywood Base (@Bollywood_Base) July 11, 2025
Fans are buzzing with excitement for Dhanush’s raw, award-worthy performance as Deva, a beggar-turned-kingpin! 🌟
Nagarjuna’s… pic.twitter.com/UT0RfIA8P4
హ్యాట్రిక్ విజయం
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సోషల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో ఒదిగిపోయారు. బిచ్చగాడిగా ఆయన నటన సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో నివసించే బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. ఈ సినిమాలోని రియల్ లొకేషన్స్, వాస్తవిక కథాంశం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఫిదా, లవ్ స్టోరీ, కుబేరా వరుస హిట్లతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అలాగే ధనుష్ కూడా 'రాయన్ ' తర్వాత 'కుబేర' తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
ఇదిలా ఉంటే ధనుష్ తాజాగా తన 54వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: Naga Babu Re Entry: 12 ఏళ్ల తర్వాత నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. 'జబర్దస్త్' ప్రోమో చూశారా