నాగ చైతన్య - సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కోర్టు.. సురేఖకు నోటీసులు పంపింది. అంతేకాకుండా తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.
మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సైతం కొండా సురేఖపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కాగా నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలోనే తన ప్రతిష్టను దెబ్బ తీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టును కోరారు కేటీఆర్.
నాగార్జున స్టేట్మెంట్..
కొండా సురేఖపై వేసిన కేసుకు సంబంధించి మంగళవారం విచారణ జరిగింది. ఇందులో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డు చేసింది.అందులో నాగార్జున..' మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని కూడా అసత్య ఆరోపణలు.
Also Read : బన్నీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి మారిన 'పుష్ప 2' రిలీజ్ డేట్..?
రాజకీయ దురుద్దేశ్యం తోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేసింది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారం చేసాయి. అన్ని పేపర్స్ ప్రచురితం చేసాయి. దీంతో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..' అంటూ తెలిపారు.