/rtv/media/media_files/2025/08/01/kingdom-movie-villan-2025-08-01-10-26-56.jpg)
Kingdom Movie Villan Venkatesh VP
Kingdom Movie Villan: ఫుడ్ ట్రక్ ఓనర్ గా మొదలై, స్టార్ కావాలనే కలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు వెంకటేష్ VP(Venkatesh VP).. సినిమా రంగంలోకి అడుగుపెట్టాలన్న కల చాలా మందికి ఉంటుంది. అయితే, ఆ కలను నిజం చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడేవాళ్లు కొందరే. అలాంటి వ్యక్తుల లిస్ట్ లో మలయాళ నటుడు వెంకటేష్ VP ఒకరు. టీవీ షోలు, చిన్న సినిమాలు, విలన్ పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ఇప్పుడు తెలుగు సినిమాల్లో మొట్ట మొదటి సారి అడుగుపెట్టారు. ఆయన నటించిన తొలి తెలుగు సినిమా 'కింగ్డమ్'(Kingdom Movie) జూలై 31న విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది.
మలయాళ టీవీ సీరియల్స్ నుంచి టాలీవుడ్ వరకూ..
వెంకటేష్ VP కేరళకు చెందినవాడు. ఆయన సినీ ప్రయాణం చాలా సాధారణంగా మొదలైంది. మలయాళ టీవీ సీరియల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుగా తన మొదటి అడుగులు వేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్నచిన్న డైలాగ్‌లు ఉండే పాత్రలు, విలనిజం గల క్యారెక్టర్లు చేయడం ద్వారా తానేంటో నిరూపించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు 'కింగ్డమ్' ద్వారా పరిచయం అవుతున్న వెంకటేష్, ఈ చిత్రంలో ‘మురుగన్’ అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
Also Read:‘కింగ్డమ్ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్
9 ఏళ్ల శ్రమ..
‘కింగ్డమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడిన విధానం, ఆయన నిజాయతీ, ప్యాషన్ అందరినీ ఆకట్టుకుంది. మొదటిసారి ఇంత మంది ప్రేక్షకుల ముందుకు రావడం తన జీవితంలో ఓ మైలురాయి అని, తాను 9 ఏళ్లుగా సినిమా రంగంలో పడ్డ శ్రమకు ఫలితం ఈ రోజు లభించిందని చెప్పారు. “ఒక రోజు స్టార్ కావాలనే కల ఉంది. దయచేసి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నన్ను హీరోగా కూడా చూడండి,” అని మనసులో మాట చెప్పాడు. అంతేకాదు, 'కింగ్డమ్' లో తన ఇంట్రోకి క్లాప్ చెయ్యండి అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా మాట్లాడాడు.
వెంకటేష్ నటనపై విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. “ఇది అతని నాలుగవ సినిమా మాత్రమే అయినా, అతనితో నటించినప్పుడు నాకు నేనే అతని ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. ఆయన కన్నుల్లో ఎనర్జీ ఉంది, నటనలో ప్రావీణ్యం ఉంది. మురుగన్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు,” అని పేర్కొన్నారు.
For the telugu people who don't know him,he came from a TV realty show & then runs a street food idly kada at trivandrum now.
— yasin~ (@YazinYz) July 28, 2025
He is still making & serving people idlys there. A true inspiration for all.
Best of luck for #Kingdom bro @venkitesh_vp ❤️ https://t.co/wtM9592Q3spic.twitter.com/phkCERUfIn
ఫుడ్ ట్రక్ యజమానిగా..
సినిమాల్లో అవకాశాల కోసం పోరాడుతూ, జీవనోపాధి కోసం వెంకటేష్ తిరువనంతపురంలో ఫుడ్ ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. నటనతో పాటు సొంత బిజినెస్ పై ఆయన చూపిన పట్టుదల ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తుంది.
తల్లి కోసం సినిమా అంకితం
ఈ సినిమా విజయాన్ని తన తల్లి తార గారికి అంకితం చేస్తున్నట్టు వెంకటేష్ తెలిపారు. అంతేకాకుండా తాను రజనీకాంత్ అభిమానిగా పెరిగానని చెప్పారు. ఈ అవకాశాన్ని పొందినందుకు ఎంతో గర్వంగా ఉందని, భావోద్వేగంగా తెలియజేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది వెంకటేష్ కు మొదటి సినిమా అయినా, మలయాళంలో మాత్రం ఆయన ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా:
The Priest (2021) - మమ్ముట్టితో పాటు నటించారు
Rebel (2024) - తమిళ చిత్రం, జివి ప్రకాశ్ కుమార్ సరసన
టీవీ సీరియల్స్‌లో అనేక పాత్రలు పోషించారు.
Also Read: విజయ్ ‘కింగ్డమ్’ డే 1 కలెక్షన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..!
కష్టపడితే ఏదైనా సాధ్యం. స్టార్ కావాలన్న కలతో చిన్న పాత్రల నుంచి వచ్చిన ఆయన, ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే, పూర్తిగా తన ప్రతిభతో ఎదుగుతున్న ఆయన వంటి నటులకు అవకాశాలు వస్తే, తెలుగు సినిమాకు కొత్త ఉత్తేజం వస్తుంది అనడంలో సందేహం లేదు.