Kichcha Sudeep: 'కిచ్చా సుదీప్' పాన్ ఇండియా మూవీ 'బిల్లా రంగా బాషా' షురూ..!

'హను-మాన్’ నిర్మాతలు తాజాగా కిచ్చా సుదీప్ హీరోగా 2209 ఏ.డి కాలం నేపథ్యంలో ‘బి.ఆర్‌.బి’ అనే సైన్స్‌ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌ను ప్రారంభించారు. అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

New Update
Kichcha Sudeepa

Kichcha Sudeepa

Kichcha Sudeep: చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రాన్ని రూపొందించిన ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

బిల్లా రంగా బాషా..

‘బి.ఆర్‌.బి’ (Billa Ranga Basha) అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ సైన్స్‌ ఫిక్షన్ చిత్రానికి "ఫస్ట్ బ్లడ్" అనే ట్యాగ్‌లైన్‌ కూడా జత చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రారంభమైందని సినీ వర్గాల సమాచారం.

Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఈ కథ 2209 ఏ.డి నేపథ్యంలో నడవనుండగా, వినోదంతో పాటు సరికొత్త విజువల్ అనుభవాన్ని అందించేలా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సాంకేతికంగా ఉన్నతంగా రూపొందుతున్న ఈ చిత్రం, భవిష్యత్తు ప్రపంచాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించనున్నదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!

Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్‌..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు