Uppu Kappu Rambu: కీర్తి 'ఉప్పు కప్పురంబు' నేరుగా ఓటీటీలోకి! స్ట్రీమింగ్ డేట్ ఇదే

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు' నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జులై 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు.

New Update

Uppu Kappu Rambu:  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు' నేరుగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జులై 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఎక్స్ లో పోస్టర్ షేర్ చేశారు. తెలుగుతో, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో కీర్తితో పాటు  సుహాస్, బాబు మోహన్, శత్రు, తల్లూరి రామేశ్వరి ముఖ్య పాత్రల్లో నటించారు.  ఐ.వి. శశి  తెరకెక్కించిన ఈ చిత్రం జయపురం అనే ఒక కల్పిత గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఒక సామాజిక సమస్యను ఎత్తిచూపుతూనే.. హాస్యభరితమైన సన్నివేశాలను కలిగి ఉంది.

గ్రామీణ నేపథ్యంలో

ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించారు. 'ఉప్పు కప్పురంబు' చిత్రం 90వ దశకంలోని గ్రామీణ జీవిత నేపథ్యంలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. జయపురం అనే గ్రామంలో శ్మశానవాటికలు పెరగడం వల్ల గ్రామస్థులు ఎలా సతమతమవుతున్నారో ఈ చిత్రం చూపిస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి ప్రస్తుతం 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' చిత్రాలతో బిజీగా ఉంది.

Also Read:Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!

Advertisment
తాజా కథనాలు