Katrina Kaif: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. కత్రినా కైఫ్ తల్లయితే చూడాలని ఉంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టడం వింతగా, విడ్డూరంగా ఉన్నాయి. పిల్లలను కని.. వివాహ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో అలియా, దీపికా ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లు అమ్మగా మారారు. ఇటీవలే కియరా అద్వానీ కూడా ప్రెగ్నెన్సీని ప్రకటించింది.
ప్రెగ్నెన్సీ ఎప్పుడు..
దీంతో కత్రినా కైఫ్ కూడా తల్లయితే చూడాలనుకుంటున్నామంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ చర్చ మొదలవ్వడానికి సల్మాన్ ఖానే ఒక కారణం. ఇటీవలే ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో.. కత్రినాతో మళ్ళీ కలిసి నటిస్తారా? అని ప్రశ్నించగా.. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైంది.. పిల్లలు కూడా పుడితే చూడాలని ఉందంటూ కామెంట్ చేశారు. దీంతో అప్పటినుంచి కత్రినా ప్రెగ్నెన్సీ పై చర్చ మొదలైంది. అయినా పెళ్లి, ప్రెగ్నెన్సీ అనేది ఎదుటివారి పర్సనల్ ఛాయిస్.. దానిపై సోషల్ మీడియాలో చర్చ జరపడం ఒక పనికిమాలిన పని అంటూ పోస్టులు పెట్టినవారిపై మరికొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
cinema-news | latest-news | telugu-news | katrina-kaif
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్