ప్రముఖ నటి కస్తూరి తెలుగు ప్రజలు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆమె తెలుగు ప్రజలను కించ పరిచేలా మాట్లాడింది. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చారని.. అలా వచ్చిన వారు ఇప్పుడు తమిళులుగా చలామణి అవుతూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేసింది.
ఈ వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లోని తెలుగు సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కస్తూరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కస్తూరి.. మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read : ఆమీర్ ఖాన్ తో దిల్ రాజు సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
క్షమాపణ కోరినా ఫలితం లేదు..
కస్తూరి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు లేఖను విడుదల చేసింది. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది. " నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను. నేను నిజమైన జాతీయవాదిని.
తెలుగు ప్రజలు నాకు పేరుతో పాటు ప్రేమ, కీర్తిని అందించారు. కొందరి వ్యక్తుల గురించి మాత్రమే నేను మాట్లాడానని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశిస్తూ నేను మాట్లాడలేదు. నా తెలుగు కుటుంబాన్ని నా ఉద్దేశం కాదు..అనుకోని సంఘటనకు నన్ను క్షమించండి.." అంటూ లేఖలో రాసింది.
Also Read : 'స్పిరిట్' 6 నెలల గ్యాప్ లోనే పూర్తి చేస్తాం.. రిలీజ్ అప్పుడే: నిర్మాత