/rtv/media/media_files/2025/10/08/karthi-va-vathiyar-2025-10-08-16-20-01.jpg)
Karthi Va Vathiyar
Karthi Va Vathiyar: కార్తి హీరోగా నటించి చాలా కాలంగా వాయిదా పడిన చిత్రం ‘వా వాతియార్’ ఇప్పుడు మళ్లీ హడావుడి చేస్తోంది. ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇది తెలుగులో బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ 2' సినిమాతో పోటీకి సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల పోటీపై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
OFFICIAL: #VaaVaathiyaar - WORLDWIDE RELEASE ON DEC 5th 💥
— Trendswood (@Trendswoodcom) October 8, 2025
Direction: Nalan Kumaraswamy
Music : SaNa
Starring : Karthi, Krithi Shetty, Rajkiran, Sathyaraj
Production : Studio Green pic.twitter.com/j2vqJNnQQs
Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?
యాక్షన్ & కామెడీ మిక్స్
ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నలన్ కుమరసామి, 'సూదు కవ్వుమ్' వంటి హిట్ సినిమాతో పేరుగాంచారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యాక్షన్, కామెడీ మిక్స్ తో వినోదాన్ని అందించబోతోందని మేకర్స్ చెబుతున్నారు.
కార్తి ఇందులో ఒక ఫన్నీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన స్టైల్, టైమింగ్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్న మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్‌లో పాపులర్ అయిన కృతి, కార్తితో కలిసి చేసే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మంచి ఆసక్తి ఉంది. సినిమాలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్‌రాజ్, శిల్పా మంజునాథ్, కారుణాకరణ్, జి.ఎం.సుందర్, రమేష్ తిలక్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ తారాగణంతో సినిమా తెరకెక్కడం విశేషం.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
సంతోష్ నారాయణన్ సంగీతం..
ఈ సినిమాకి మ్యూజిక్ సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమాకు కొత్త సౌండింగ్ వినిపిస్తోంది. ఈ సినిమాను K.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు, ఆయనకు చెందిన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
‘వా వాతియార్’ సినిమా అందులో కార్తి నటన, ఫన్ అండ్ యాక్షన్ మిక్స్, స్ట్రాంగ్ కాస్టింగ్, క్యాచీ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, తెలుగు-తమిళ బాక్సాఫీస్ వేదికగా ఓ మాస్ ఎంటర్టైన్మెంట్ పోటీ నెలకొననుంది!
Follow Us