Kantara Trailer: 'కాంతార: చాప్టర్ 1' ట్రైలర్ సెన్సేషన్.. 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్!

‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్‌కు 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికేట్ లభించింది.

New Update
Kantara Trailer

Kantara Trailer

Kantara Trailer: 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కాంతార: చాప్టర్ 1’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి నటిస్తున్న ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్!

ఇప్పటికే ఈ ట్రైలర్ అన్ని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై కలిపి 107 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే అన్ని భాషల్లో కలిపి 3.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. దింతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది. ముఖ్యంగా హిందీ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీనిని బట్టి హిందీ మార్కెట్‌లో సినిమా ఎంతగా ఆకట్టుకుంటుందో అర్థమవుతోంది.

Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!

కాంతార ట్రైలర్‌ విజువల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఫోక్ టచ్, ఇంటెన్సిటీ, మ్యూజిక్‌, విజువల్స్ అన్నీ బలంగా కనిపించాయి. సాంకేతికంగా కాదు, భావోద్వేగాల పరంగా కూడా ట్రైలర్‌ చాలా బలంగా నిలిచింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ "ఇది కేవలం సినిమా కాదు, ఒక అద్భుతమైన అనుభూతి" అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ‘OG’కు A సర్టిఫికేట్.. ఇక రికార్డులు బద్దలే..!

పాన్ ఇండియా ప్రమోషన్

ఈ ట్రైలర్‌ని పాన్ ఇండియా ప్రమోషన్‌గా తెలుగులో ప్రభాస్, తమిళంలో శివ కార్తికేయన్, హిందీలో హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లాంచ్ చేయడం విశేషం. ఈ విధంగా మేకర్స్ అన్ని భాషల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమా ప్రమోషన్‌ను బలంగా చేస్తున్నారు.

సెన్సార్, రన్‌టైమ్

సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని U/A 16+ సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్‌టైమ్ 168 నిమిషాలు (2 గంటల 48 నిమిషాలు)గా ఉంది. ఇది మాస్ యాక్షన్ డ్రామాకు సరిపోయే నిడివి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!

నటీనటులు, సాంకేతిక బృందం

ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గుల్షన్ దేవయ్య విలన్‌గా కనిపించనుండగా, జయరాం, రాకేశ్ పూజారి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారు. అక్టోబర్ 2, 2025న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ స్పందన చూస్తుంటే, మరోసారి కాంతార మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు