/rtv/media/media_files/2025/09/27/kantara-chapter-1-2025-09-27-16-35-12.jpg)
Kantara Chapter 1
Kantara Chapter 1: సెన్సేషనల్ హిట్ కాంతారాకి ప్రిక్వెల్‌గా తెరకెక్కుతున్న 'కాంతారా చాప్టర్ 1' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి(Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో, హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2, 2025న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
Kantara Chapter 1 Tickets Price Hike
తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటంతో, తెలుగు వెర్షన్‌కు భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకి టికెట్ ధరలు రూ. 50 పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
ఈ సినిమాలో రుక్మిణి వసంత కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జయరాం, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ థుమినాడ్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
కథ విషయానికి వస్తే,
ఇది గ్రామీణ నేపథ్యం, దేవతల తత్వం, మరియు ఫోక్ కల్చర్‌ను మిళితం చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సినిమా సెన్సార్ పూర్తయ్యి U/A 16+ సర్టిఫికేట్ను పొందింది. రన్‌టైమ్ సుమారు 168 నిమిషాలు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
సెప్టెంబర్ 28న హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. దర్శకుడు రిషబ్ శెట్టి ఎన్టీఆర్‌కు పెద్ద అభిమాని కావడం వల్ల ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎన్టీఆర్ హాజరుతో ఈ ఈవెంట్‌కు మరింత హైప్ ఏర్పడనుంది.