Kantara Chapter-1: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార చాప్టర్ 1’. గతంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘కాంతార’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు సినిమా మేకింగ్ విశేషాలను పంచుకుంటూ ఓ గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. ఒక శక్తి అంటూ రిషబ్ మూవీ జర్నీని వివరించారు. మూడేళ్ళ కఠోర శ్రమ, 250 రోజుల పాటు చిత్రీకరణ తర్వాత సినిమాను పూర్తిచేసినట్లు వెల్లడించారు.
Wrap Up… The Journey Begins ❤️🔥
— Rishab Shetty (@shetty_rishab) July 21, 2025
Presenting #WorldOfKantara ~ A Glimpse into the making.
– https://t.co/xuXXlpIOsb
Head to Settings -> Audio Track -> Select your language of choice. pic.twitter.com/27eBzOpFrp
భారీ యాక్షన్ సీన్స్
ఈ వీడియోలో రిషబ్ శెట్టి.. సినిమా పట్ల తాను పెట్టుకున్న నమ్మకం, ప్రాజెక్ట్ కోసం వెచ్చించిన కృషిని చూపించారు. ఈ సినిమా కోసం రిషబ్ శారీరకంగా చాలా మార్పులు చేసుకున్నారు. అంతేకాదు యుద్ధ సన్నివేశాల కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, కలరిపయట్టులో 3 నెలల శిక్షణ తీసుకున్నాడు. అలాగే సినిమాలో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. దాదాపు 500 మందికి పైగా శిక్షణ పొందిన యోధులు, 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఈ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం.
ఇప్పటికే విడువులైన ఫస్ట్ లుక్, టీజర్ భారీ హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు విడుదలైన జర్నీ 'వీడియో ' అంచనాలను మరింత పెంచింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న 'కాంతారా చాప్టర్ 1' ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడతో పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని హోంబోలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద చిత్రాల్లో ఒకటిగా దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రిషబ్ హీరోగా నటించడంతో పాటు ఆయనే డైరెక్ట్ చేశారు.