/rtv/media/media_files/2025/09/19/kantara-imax-2025-09-19-11-23-17.jpg)
Kantara IMAX
Kantara IMAX: ఇప్పుడు శాండల్‌వుడ్‌లోనే కాదు టాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఉన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. మూడు సంవత్సరాల క్రితం విడుదలైన మొదటి భాగం ‘కాంతార’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ₹15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ₹400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనంగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్
రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2, 2025న పలు భాషల్లో భారీగా విడుదల కానుంది. రిషబ్ శెట్టి ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే కాకుండా హీరోగా కూడా కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఐమాక్స్ లో కూడా రిలీజ్
తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, ఈ సినిమాను IMAX ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఇది అనూహ్యమైన విషయమే. ఐమాక్స్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం అందుబాటులో ఉన్న అన్ని భాషల్లోనే ఐమాక్స్‌లో రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని సోషల్ మీడియాలో బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
ప్రీమియర్ షోల ప్లాన్
సినిమా రిలీజ్ ముందు రోజు అంటే అక్టోబర్ 1న సాయంత్రం 7 గంటలకు వరల్డ్‌వైడ్ ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇది జరుగితే, కన్నడ పరిశ్రమలో తొలి బిగ్-బడ్జెట్ ప్రీమియర్ షో నిర్వహించిన సినిమా ఇదే అవుతుంది. తెలుగు, తమిళ సినిమాల్లో ప్రీమియర్స్ మంచి ఫలితాలివ్వడంతో అదే ట్రెండ్‌ను కాంతార కూడా ఫాలో కావడం గమనార్హం.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ వస్తే, సినిమా మొదటి రోజే బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. పైగా స్పెషల్ షోలు కలెక్షన్లను మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మేకర్స్ ఈ ప్రీమియర్ షోలపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ, ఇండస్ట్రీలో ఈ విషయం ఖచ్చితమేనన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.
అమెరికాలో భారీగా రిలీజ్
ఉత్తర అమెరికాలో 50కి పైగా ఐమాక్స్ స్క్రీన్‌లలో ‘కాంతార చాప్టర్ 1’ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అదీ మల్టిపుల్ లాంగ్వేజ్‌లలో అంటే, ఈ సినిమాపై గ్లోబల్‌గా ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది అజనీష్ లోకనాథ్. నిర్మాణ బాధ్యతలను హోంబలే ఫిలింస్ చేపట్టింది. ఇదే బ్యానర్ కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చింది. దాంతో, ‘చాప్టర్ 1’కు కూడా మాస్ కనెక్ట్ తప్పకుండా వుంటుందని అభిమానులు నమ్ముతున్నారు. ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ విడుదల తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశముంది. మేకర్స్ అందుకు తగిన విధంగా ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు.
Follow Us