Kantara 2: 'కాంతారా 2' లో మరో ఆర్టిస్ట్ మృతి!

కాంతారా 2 చిత్రబృందంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కలభవన్ నిజు గుండెపోటుతో మరణించారు. గురువారం ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Kantara 2 mimicry artist died

Kantara 2 mimicry artist died

Kantara 2:  'కాంతారా 2'  షూటింగ్ మొదలైనప్పటి సెట్ లో  ఏదో ఒక ప్రమాదం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చిత్రబృందంలో మరో విషాదం చోటుచేసుంది. ఈ సినిమాలో పనిచేస్తున్న  మిమిక్రీ ఆర్టిస్ట్,  నటుడు కళాభవన్ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఓ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. కళాభవన్ జూనియర్ ఆర్టిస్టుల కోసం ఏర్పాటు చేసిన స్టే హోమ్ లో ఉండగా.. గురువారం ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో వెంటనే  ఆయన్ను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

మూడో విషాదం 

ఇప్పటికే  'కాంతారా ' చిత్ర బృందానికి సంబంధించి  ఇద్దరు నటులు మృతిచెందగా.. కళాభవన్ మూడో వ్యక్తి.  ఇటీవలే  కాంతారా 1 లో నటించిన ప్రముఖ కన్నడ నటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత  జూనియర్ ఆర్టిస్ట్ ఎం.ఎఫ్. కపిల్ కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.  అయితే ఆ సంఘటన  'కాంతారా ' షూటింగ్ లో జరగలేదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఆ రోజు అతడికి షూటింగ్ షెడ్యూల్ లేదని..  వ్యక్తిగత కార్యకలాపాల్లో ఆ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు.

మార్కో సినిమాలో 

కేరళలోని త్రిస్సూర్ లోని వడనప్పల్లికి చెందిన నిజు సుమారు 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో  ఉన్నాడు.   రెండు దశాబ్దాల క్రితం కేరళ మిమిక్రీ ఆర్టిస్టులు నిర్వహించిన రోడ్ షోలో ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత సహాయ పాత్రలలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. రీసెంట్ గా  'మాలికాపురం' సినిమాలో ఉన్నిముకుందన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  ఆ తర్వాత  'మార్కో' లో కూడా కనిపించారు.  

Also Read:దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

Advertisment
తాజా కథనాలు