Rishab Shetty : 'కాంతారా' హీరో ఎమోషనల్ పోస్ట్.. 24 ఏళ్ళ కల నిజమైందంటూ!
హీరో రిషబ్ శెట్టి తన అభిమాన హీరో చియాన్ విక్రమ్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ' విక్రమ్ ను కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది' అంటూ పేర్కొన్నారు.