Kannappa: 'కన్నప్ప'.. ప్రభాస్ మేకింగ్ వీడియో చూశారా!

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో స్పెషల్ రోల్ పోషించిన ప్రభాస్ మేకింగ్ వీడియో బయటకొచ్చింది. శివ భక్తుడి వేషంలో అడవిలోనుంచి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ డిఫరెంట్‌గా కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

New Update

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన 'కన్నప్ప' ఈనెల 27న థియేటర్స్ లో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కన్నప్ప షూటింగ్ కి సంబంధించి ప్రభాస్ మేకింగ్ వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇందులో ప్రభాస్ శివ భక్తుడి వేషంలో అడవిలోనుంచి ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. అంతేకాదు సినిమా సెట్‌లో విష్ణు, మోహన్ బాబుతో చర్చిస్తున్న దృశ్యాలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్.. సినిమాలో ప్రభాస్ రోల్ ఎలా ఉండబోతుందా? అని ఉత్సాహంగా ఉన్నారు. 

Allu Arjun: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు