Upendra: కన్నడ స్టార్ ఉపేంద్ర భార్య ఫోన్ హ్యాక్..

కన్నడ నటుడు ఉపేంద్ర, భార్య ప్రియాంక ఫోన్లు హ్యాక్ అయ్యాయి. డబ్బులు అడుగుతూ మెసేజ్‌లు వస్తే స్పందించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

New Update
Upendra

Upendra

Upendra: ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర, తన భార్య ప్రియాంక ఫోన్‌లు సైబర్ మోసగాళ్ల చేతిలో హ్యాక్ అయ్యాయని తెలిపారు. సోమవారం ఆయన ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరి ఫోన్ నంబర్ల నుంచి డబ్బు కోరుతూ మెసేజ్ వస్తే, ఎవరు స్పందించవద్దని ఉపేంద్ర స్పష్టం చేశారు.

మొదట ఉపేంద్ర భార్య ప్రియాంకకు తెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆన్‌లైన్ ఆర్డర్‌ గురించి ఉంది, అది నిజమని నమ్మిన ఆమె చివరకు హ్యాకర్ల చేతిలో మోసపోయింది. ఇదే తరహాలో ఉపేంద్రకు కూడా ఒక మెసేజ్ వచ్చిందని, తాను కూడా కొంతవరకు నమ్మానని ఆయన తెలిపారు. దీంతో ఇద్దరూ సైబర్ మోసానికి గురైయ్యారు. 

Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

ఈ ఘటనల వెనుక హ్యాకర్ల పాత్ర ఉన్నట్లు ఉపేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫోన్ నంబర్లను ఉపయోగించి డబ్బు అడుగుతూ మెసేజ్  పంపుతున్నారని తెలిపారు. అలాంటి మెసేజ్ వచ్చినవారు వెంటనే అప్రమత్తమవ్వాలని సూచించారు.

"మేము త్వరలోనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేస్తాం," అని ఉపేంద్ర వెల్లడించారు. "మా నంబర్ల నుంచి డబ్బు అడిగే మెసేజ్‌లు లేదా కాల్స్ వస్తే వాటిని ఎవ్వరూ నమ్మకండి. అలాంటి వాటికి స్పందించవద్దని మా మనవి," అని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఎవరైనా తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లపై అప్రమత్తంగా ఉండాలని ఉపేంద్ర సూచించారు. ఎవరైనా డబ్బు అడిగితే దాన్ని నమ్మకుండా, మొదట ఆ వ్యక్తిని స్వయంగా సంప్రదించి విషయాన్ని క్లారిఫై చేసుకోవాలని హెచ్చరించారు.

మీ ఫోన్ నంబర్లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడమే మంచిది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి - ఆన్‌లైన్ లో మన భద్రత మన చేతుల్లోనే ఉంటుంది!

Advertisment
తాజా కథనాలు