/rtv/media/media_files/2025/07/28/ramya-2025-07-28-15-51-20.jpg)
కన్నడ సినీ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన (రమ్య)కు ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అభిమానుల నుంచి తీవ్ర బెదిరింపులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి రమ్య చేసిన వ్యాఖ్యలే ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రమ్య తన సోషల్ మీడియాలో రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి అని తన మద్దతును తెలుపుతూ ఆమె ఓ పోస్టు పెట్టారు. దీంతో ఆ పోస్ట్‌కు హీరో దర్శన్ అభిమానులు తనకు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారని నటి తెలిపారు.
— Ramya/Divya Spandana (@divyaspandana) July 28, 2025
ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్క్రీన్ షార్ట్స్ లను పోస్టు చేశారు. రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేసి ఉండాల్సింది. అత్యాచారం చేస్తామంటూ ఎంతోమంది దర్శన్ అభిమానులు తనకు మెసేజ్‌లు పంపినట్లు చెప్పారు. తనతో పాటుగా తన ఫ్యామిలీని కూడా వదలడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బెదిరింపులపై తాను ఇప్పటికే తన లాయర్ ను కలిసి చర్చించానని చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపుల మెసేజ్‌లను పోలీసుల దృష్టికి తీసుకువెళ్తానని.. ఆ కామెంట్స్ చేసిన వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ఇలాంటి కామెంట్స్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని రమ్య అభిప్రాయపడ్డారు. డిజిటల్ యుగంలో సోషల్‌మీడియాను ఇలా ఉపయోగించడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. అన్ లైన్ లో అత్యాచార బెదిరింపులు రావడం దారుణం అన్నారు రమ్య. ఇది కన్నడ సినీ పరిశ్రమలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
సుప్రీంకోర్టు విచారణ పూర్తి
కాగా రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామి, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపాడనే ఆరోపణలతో జూన్ 2024లో బెంగళూరులో హత్య చేయబడ్డాడు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా 17 మంది నిందితులుగా ఉన్నారు. వారందరూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, హింసించి, ఆ తర్వాత చంపి డ్రైన్ లో పడేశారని పోలీసులు ఆరోపించారు.