'మట్కా' నుంచి మరో కొత్త పోస్టర్.. వైరల్ అవుతున్న లుక్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. తాజాగా ఈ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రవి శంకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. By Archana 30 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update MATKA షేర్ చేయండి MATKA: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. 1950, 1980 కాలం నాటి కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ వీడియోలో.. ఆ కాలం నాటికి తగ్గట్లు వరుణ్ తేజ్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. Also Read: థ్రిల్లర్స్ అంటే ఇష్టమా? అయితే ఈ సినిమా చూడండి..స్ట్రీమింగ్ ఎక్కడంటే ? కొత్త పోస్టర్ తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బొమ్మాలి రవిశంకర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కుడిచేతిలో తుపాకీ, ఎడమ చేతిలో పిస్తోల్ పట్టుకున్న రవి శంకర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. దీంతో ఈ మూవీలో రవి శంకర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే దాని పై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది. వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Also Read: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? Tough, Ruthless & Shrewd Jailer 🔥Presenting #RaviShankar as 'Narayana Murthy' from #MATKA 🤩IN THEATERS WORLDWIDE ON NOVEMBER 14, 2024 💥#MATKAonNOV14thMega Prince @IamVarunTej @KKfilmmaker @Meenakshiioffl #NoraFatehi @gvprakash @kishorkumardop @karthikaSriniva… pic.twitter.com/w1M97mSQgj — BA Raju's Team (@baraju_SuperHit) October 29, 2024 Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి