/rtv/media/media_files/2025/09/23/junior-ott-2025-09-23-19-32-14.jpg)
Junior OTT
Junior OTT: యువ హీరో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన ‘జూనియర్’ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకొని OTT రిలీజ్ కు సిద్ధమైంది. మొదట ఈ చిత్రం సెప్టెంబర్ 22, 2025న ఓటీటీ వేదికగా విడుదల కావాల్సి ఉండగా, ఊహించని కారణాల వల్ల ఆ తేదీన స్ట్రీమింగ్ జరగలేదు.
Also Read: 'OG' రిలీజ్ పోస్ట్ పోన్..? అసలు ఎందుకింత గందరగోళం..!
అయితే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా (Aha), కన్నడ ఓటీటీ నమ్మా ఫ్లిక్స్ (Namma Flix) ద్వారా ఈ సినిమా సెప్టెంబర్ 30, 2025న స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలవుతుండడం విశేషం.
"వైరల్ వయ్యారి".....
ఈ సినిమాతో గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు జోడీగా శ్రీలీల కనిపించగా, హీరోయిన్ జెనీలియా ఓ కీలక పాత్రలో నటించారు. కాలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో మొదలయ్యే ఈ చిత్రం, తరువాత ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మారుతుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి, ముఖ్యంగా "వైరల్ వయ్యారి" అనే పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: 'ఓజీ' షో క్యాన్సిల్.. పవన్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్!
థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, డిజిటల్ వేదికపై ఎలా ఫర్‌ఫామ్ చేస్తుందో సెప్టెంబర్ 30న తేలిపోతుంది. OTT రిలీజ్ తో ఇప్పుడు ప్రేక్షకులు ‘జూనియర్’ సినిమాను తమ ఇంట్లోనే చూసే అవకాశం పొందనున్నారు.
Follow Us