/rtv/media/media_files/pWVm8a0ieLbvvvKQCo2S.jpg)
Devara Movie :
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే రిలీజ్ కు ముందే ఈ సినిమాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఈవెంట్లో ‘దేవర’ను ప్రదర్శించనున్నారు.
కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్’లో ‘దేవర’ను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్‌లో ఈ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు దీన్ని వీక్షించనున్నారు. దీనికోసం ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని సినీవర్గాలు తెలిపాయి.
GLOBAL STAR ⭐ ⭐ ⭐ NTR #Devara to be premiered at Beyond Fest on September 26 at 6:30 PM PST at the Egyptian Theatre, Hollywood, Los Angeles.#DevaraStorm@tarak9999@DevaraMovie#DevaraOnSep27thpic.twitter.com/pfJei6nBhb
— TIGER NTR FANS (@TigerNTRFans) September 12, 2024
ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా 'దేవర' ప్రీసేల్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం తారక్ ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ముంబైలో ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుతూ..' దేవర’ విజువల్స్ అద్భుతంగా ఉంటాయన్నారు. చివరి 40 నిమిషాల సినిమా విశేషంగా ఆకట్టుకుంటుందని' తెలిపారు. దీంతో మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.