సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఫ్యామిలీతో తారక్ సందడి

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్‌, లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ తదితరులు సందడి చేశారు.

ntr.23
New Update

టాలీవుడ్ యంగ్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం అతని నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్‌, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ తదితరులు సందడి చేశారు. 

కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో తారక్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక నార్నే నితిన్.. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు తనయుడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు. 

Also Read : 'అమరన్' కు రికార్డ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ కెరీర్లోనే అరుదైన ఘనత..!

గత ఏడాది 'మ్యాడ్' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత రీసెంట్ గానే 'ఆయ్' సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేశారు. ఆగస్టు నెలలోవిడుదలైన ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటూ హీరోగా నార్నే నితిన్ క్రేజ్ మరింత పెరిగింది.

Also Read : స్టార్ హీరోల సినిమాల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే హీరోయిన్నే మార్చేస్తారు : తాప్సి

#ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe