జానీ మాస్టర్ సర్ప్రైజ్
టాక్ షో మధ్యలో జానీ మాస్టర్ సర్ప్రైజ్ ఎంట్రీ.. ప్రభుదేవాను ఆశ్చర్యపరిచింది. డాన్స్ ప్రపంచంలో ప్రభుదేవా ఒక లెజెండ్ స్థానాన్ని సంపాదించుకున్నారు. నేటి తరం టాప్ కొరియోగ్రాఫర్లలో చాలా మంది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగారు. అలంటి వారిలో జానీ మాస్టర్ ఒకరు. జానీ మాస్టర్ స్టేజిపై ప్రభుదేవా పై తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకున్నారు.
ఎక్కువ చేయకు..
ఈ క్రమంలో ప్రభుదేవా జానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జానీ చాలా మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్ అని కొనియాడారు. ''ఒక సాంగ్ కి మూమెంట్ అడిగితే.. 5 సాంగ్స్ కి కావాల్సినన్ని మూమెంట్స్ కంపోజ్ చేస్తాడు. అందుకే నేను ఎప్పుడు జానీకి చెప్తుంటాను.. ఎంత డబ్బు తీసుకుంటావో అంతే చేయి.. ఎక్కువ చేయకు అని'' అంటూ నవ్వులు పూయించారు ప్రభుదేవా.
India lo naaku intha peru vacchindi ante daniki Chiranjeevi sir ye reason - Prabhudeva in Jagapathi Babu show
— Shiva (@Mygodshiva) September 27, 2025
🔥🔥@KChiruTweets#MegaStarChiranjeevipic.twitter.com/g1RWSqRwcu
జగపతి బాబు సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం, విజయాలు, ఎదుగుదల, కష్టాలతో పాటు వారి జీవితంలో ఎదురైనా సరదా సంఘటనల గురించి మాట్లాడతారు. ఇప్పటికే నాగార్జున, సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవీ, మీన, సిమ్రాన్, శ్రీలీల, తేజ సజ్జ వంటి స్టార్ సెలబ్రెటీలు ఈ షోలో గెస్టులుగా సందడి చేశారు.
Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!