జైలు నుంచి బయటికొచ్చాక మరో అమ్మాయితో జానీ మాస్టర్.. వీడియో వైరల్

జానీ మాస్టర్ తాజాగా ఓ లేడీ డ్యాన్సర్ తో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇటీవల ఆయన కొరియోగ్రఫీ చేసిన ఓ హిందీ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా అదే సాంగ్ కు లేడీ డ్యాన్సర్ తో కలిసి సరదాగా స్టెప్పులేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

New Update
jani master

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలైన సంగతి తెలిసిందే. ఈ ఒక్క కేసు ఆయన కెరీర్ ను పూర్తిగా డౌన్ చేసేసింది. అయితే ఈ కేసులో ఆయన కోర్టుకు బెయిల్ కోరారు. అయితే కోర్టు మొదట ఆయన బెయిల్ ను రద్దు చేసింది. 

దాంతో జానీ మాస్టర్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆయన పిటిషన్ ను పరిశీలించిన హై కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే బెయిల్ పై బయటికొచ్చిన జానీ మాస్టర్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ లేడీ డ్యాన్సర్ తో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. 

Also Read : ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం

లేడీ డ్యాన్సర్ తో కలిసి..

బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ నటించిన 'బేబీ జాన్' సినిమాలో ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సాంగ్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సందర్భంగా అదే సాంగ్ కు జానీ మాస్టర్ లేడీ డ్యాన్సర్ తో కలిసి సరదాగా స్టెప్పులేశారు. 

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు..' మళ్ళీ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నావ్, ఈసారైనా జాగ్రత్తగా ఉండు..' అన, మరికొందరేమో..' జానీ మాస్టర్ మీరు అస్సలు తగ్గొద్దు, డ్యాన్స్ ఇరగదీయండి, మీ కంబ్యాక్ కోసం వెయిటింగ్.. అని  అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

Also Read: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతి

 ఇది కూడా చదవండి: మా జోలికొస్తే తాటతీస్తాం.. కేసీఆర్ ను అంత మాట అంటావా! కవిత ఫైర్

Advertisment
Advertisment
తాజా కథనాలు