Janhvi Kapoor: భుజాన చేప, నోటితో కత్తి.. కళ్లు చెదిరేలా దేవర బ్యూటీ బర్త్ డే పిక్..

జాన్వీ కపూర్ 28వ బర్త్ డే సందర్భంగా, 'దేవర' మూవీ టీమ్ జాన్వీ పాత్రకు సంబంధించిన కొత్త స్పెషల్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా 'X'లో పోస్ట్ చేసారు. భుజాన చేపలను తగిలించుకొని, నోటితో కత్తిని పట్టుకుని ఉన్న జాన్వీ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

New Update
Janhvi Kapoor Birthday Special

Janhvi Kapoor Birthday Special

Janhvi Kapoor: యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కాంబోలో వచ్చిన 'దేవర'(Devara) గతేడాది దసరాకి విడుదలై సూపర్ సక్సెస్ అయ్యింది. మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా సరే, కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో జోడీగా జాన్వీ కపూర్ నటించారు. తంగం అనే పాత్రలో పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టేసింది జాన్వీ.

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

నోటితో కత్తిని పట్టుకుని అదిరిపోయే లుక్ లో

జాన్వీ కపూర్ 28వ పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు, 'దేవర' మూవీ టీమ్  ఆమె పాత్రకు సంబంధించిన కొత్త స్పెషల్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. పోస్టర్‌లో, జాన్వీ భుజాన చేపలను తగిలించుకొని, నోటితో కత్తిని పట్టుకుని అదిరిపోయే లుక్ లో కనిపిస్తుంది. మనసు దోచే చూపులతో ఉన్న జాన్వీ పోస్టర్ చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్స్, "ఇంత అందంగా ఉన్న పోస్టర్ లుక్ సినిమాలో లేదు ఏంటి?" అని కొంత మంది ట్రోల్ చేస్తున్నారు.

'దేవర' సినిమా రిలీజ్ కి ముంది జాన్వీ పాత్రకి ఒక రేంజ్ లో హైప్ ఇచ్చారు మూవీ యూనిట్. కొరటాల శివ కూడా ఆమె పాత్రను “ఎప్పటికీ గుర్తుండిపోయే” పాత్ర అని చెప్పుకొచ్చారు, కానీ సినిమా విడుదల అయ్యాక ఈ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు, ఎక్కువ ప్రాధాన్యం లేనట్లు కనిపించింది జాన్వీ పాత్ర. ఆమె పాత్రను తక్కువగా చూపించడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. 

అయితే, ఇప్పుడు తాజాగా జాన్వీ బర్త్ డే కానుకగా ఈరోజు విడుదల చేసిన కొత్త పోస్టర్‌ 'దేవర 2' లో లుక్ కావచ్చు అని అనుకుంటున్నారు. అయితే కొరటాల శివ ఇప్పటికే 'దేవర 2' లో జాన్వీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దేవర మొదటి భాగంతో పోల్చుకుంటే సెకండ్ పార్టీలో జాన్వీ పాత్ర అదిరిపోతోంది అని అభిమానులు ఆశ పడుతున్నారు. దేవర పార్ట్ 2 రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు