Cine MA : క్యాస్టింగ్ కౌచ్ నీచులను కాపాడేది సిని'మా' పెద్దలేనా?

జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల వ్యవహారంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తేనెతుట్ట కదిపినట్టయింది. దానికితోడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ట్వీట్ చేయడంతో దృష్టి సినిమా పెద్దల మీదకు మళ్ళింది.

New Update
tfi

Casting Couch : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఏమీ కొత్తేమీ కాదు. ప్రతీ ఇండస్ట్రీలోనూ ఇది ఏదో ఒక స్టేజ్‌లో బయటపెడుతూనే ఉంది. చిన్న చిన్న యాక్టర్ల నుంచి పెద్ద స్టార్ల వరకూ తమ మీ లైంగిక దాడి జరిగిందని కంప్లైంట్ చేసినవారే. ఇందులో పెద్ద వారి దగ్గర నుంచీ ఇన్వాల్వ్ ఉందనే విషయం బహిరంగ రహస్యం. కానీ దీని గురించి మాట్లాడ్డానికి ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా వారి మీద విపరీతంగా దాడి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అంతో ఇంతో మాట్లాడినా…కొన్ని రోజులు ఉంటుంది…ఆ తరువాత అంతా మామూలే. 

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా పెద్ద హీరోయిన్లకు సమస్యలు తక్కువే ఉంటాయి. కానీ చిన్న ఆర్టిస్ట్‌లకు, ఇతర క్రూ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు ఇండస్ట్రీలో నిలబడాలంటే…తురువాత సినిమా అవకాశం రావాలంటే పెద్దలు చెప్పిన పని చేయాల్సిందే. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోరు. అంతెందుకు పూనమ్ కౌర్ (Poonam Kaur)…ఈమె ఒకప్పుడు హీరోయిన్. కానీపెద్ద నటిగా మాత్రం ఎదగలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె చాలా రోజులుగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మీద ఫిర్యాదులు చేస్తూనే ఉంది. అంతకు ముందు పవ్ కల్యాణ్ మీద కూడా చాలాసార్లు మాట్లాడింది. కానీ పట్టించుకేనే నాథుడే కరువయ్యారు. ఇప్పుడు కూడా జానీ మాస్టర్ వ్యవహారం బయటకు వచ్చాక కూడా పూనమ్ మళ్ళీ త్రివిక్రమ్ మీద ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా పట్టించుకోండి అంటూ మా కు ఫిర్యాదు చేస్తారు. కానీ ఇప్పుడు కూడా ఆమె మాటలను సినిమా పెద్దలు పట్టంచుకుంటారని గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు కూడా కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ముందు మా పెద్దలకే ఫిర్యాదు చేసింది. అక్కడ ఫలితం కనిపిచకపోయేటప్పటికి పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసింది. దాంతో వ్యవహారం బయటకు వచ్చింది. మీడియా ముందు మాట్లాడింది. ఇంత జరిగిన తర్వాత ఇక లాభం లేదని..ఇప్పుడు మా దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Also Read :  పేలిన పేజర్లు.. పదుల సంఖ్యలో మృతులు!

Telugu Film Industry

తెలుగు ఇండస్ట్రీలో ఇంతకు ముందు కూడా ఇలాంటి వ్యవహారాలు చాలానే జరిగాయి. కానీ అవ బయటకు రాలేదు. శ్రీరెడ్డి లాంటి వారు మా ఆఫీస్ ముందు బట్టలు విప్పి మరీ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. ఏకంగా సురేష్ బాబు కొడుకే ఆ పని చేశాడని చెప్పింది. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారంటూ గోలగోల చేసింది. కానీ ఏం జరిగింది. వాళ్ళందరూ బావున్నారు. శ్రీరెడ్డే ఎందుకూ కాకుండా పోయింది. ఏకంగా తెలుగు ఇండస్ట్రీ ఆమెని వెలివేసింది. ఇది కాకుండా చలపతి రావు లాంటి పెద్ద నటులు, పెద్ద పేరున్న హీరోలు కూడా కనిపిస్తే కడుపులు చేస్తామంటూ మాటలు మాట్లాడారు. వారి మీద యాక్షన్ తీసుకోవడం మాట అటుంచి..కనీసం దానిని ఖండించిన వారు కూడా లేరు. సీనియర్ యాక్టర్ చలపతి రావు మీద చిన్న పెద్దా నటులంతా మండిపడడంతో ఏదో ఆయన చేత సారీ అయితే చెప్పించగలిగారు. అంతే అక్కడతో ఆ వ్యహారం ఆగిపోయింది.మరో పెద్ద నటుడి మీద అయితే అది కూడా లేదు.

ఇలా చెప్పుకుంటే పోతే ఇలాంటి ఉదంతాలు బోలెడు ఉంటాయి తెలుగు ఇండస్ట్రీలో. కానీ బయటకు రావు. వచ్చినా ఎవరూ పట్టించుకోరు. ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్‌ను సినిమా పెద్దలే కాపాడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలుసు. తెలుగు సినిమా మొత్తం రెండు, మూడు కులాలు, వాటికి సంబంధించ కుటుంబాల మధ్యే ఉంది. ఏం జరిగినా వారి మధ్యే జరుగుతుంది. ఫిల్మ్ ఆక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకుంటారు. మా అధ్యక్షులుగా కూడా వాళ్ళ కుటుంబాల నుంచే ఉంటారు. వీళ్ళే మొత్తం వ్యవహారాలు అన్నీ చూసుకుంటారని అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్లు వీరికి ప్రీతిపాత్రులు. అందుకే ఎవరు ఎలాంటివి చెప్పినా అసలు పట్టించుకోరు. కనీసం ఆ విషయాన్ని కూడా బయటకు రానివ్వరు. అందుకే పూనమ్ కౌర్ తను రాజకీయంగా ఇబ్బంది పెట్టారు అంటూ ట్వీట్ చేసింది. నిజానికి క్యాస్టింగ్ కౌచ్ గురించి మా అసోసియేషన్ 2019లోనే ఒక కమిటీ వేసింది. కానీ అది పేరుకు మాత్రమే ఉంది. కమిటీ సభ్యులు తెలుగు ఇండస్ట్రీలో సమస్యల గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సినిమా పెద్దల భయంతో ఎవరూ నోరు విప్పలేదు. స్వయంగా కమిటీలో ఉన్న సభ్యులే ఈ విషయాన్ని చెప్పారు. తామే స్వయంగా వెళ్ళి అడిగినా క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పేది లేదని…తాము ఏ మాత్రం మాట్లాడినా నష్టం తమకే అని సమాధానం చెప్పారని చెబుతున్నారు. చిన్న నటులు నోరు విప్పితే అక్కడి నుంచి వాళ్ళు సినిమాల్లో ఉండడం కష్టమే. పెద్దలు వాళ్ళ కెరియర్‌‌ను ఫుట్ బాల్ తన్నినట్టు తన్ని అవతల పడేస్తారు. అందుకే ఎవరూ తమ ఇబ్బందులు చెప్పడానికి బయటపడరు.

ఇప్పుడు కూడా చాలామందిని కాపాడ్డానికి మా అసోసియేషన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలుగు ఇండస్ట్రీ పరిష్కార ప్యానెల్ ఇంకా మా అసోసియేషన్ ఆఫ్ ద రికార్డ్‌లో సినీ నటులకు, హెల్పర్లు, ఇతర డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన వారందరితో మాట్లాడిందని తెలుస్తోంది. ఏమైనా సమస్యలు ఉంటే తమ దగ్గరకు రావాలని…మీడియా దగ్గరకు వెళ్ళొద్దని సూచించిందని చెబుతున్నారు. తాము కచ్చితంగా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని తెలుస్తోంది. మీడియా వరకు వెళితే తెలుగు సినిమా అల్లరి పాలవుతుందనే ఉద్దేశంతో మా.. విషయాలను బయటకు వెళ్ళనివ్వొద్దని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బయటపడకుండా కాపాడేది సినిమా పెద్దలే అన్నది వాస్తవం. అప్పుడప్పుడూ బయటకు చిన్న చితకా నటులు బయటకు వచ్చి కంప్లైంట్ చేసినా…దాన్ని అక్కడిక్కడే అణగదొక్కేస్తారు. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ నీతులు చెప్పేవారే కానీ అసలు విషయం వచ్చేసరికి అందరూ దొంగలే అన్నట్టు ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వ్యవహారం.

Also Read : ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!
Advertisment
తాజా కథనాలు