/rtv/media/media_files/HTHZBWfsfUmABOPMWKUA.jpg)
Shah Rukh Khan dance
IIFA awards 2024 : IIFA అవార్డ్స్ 2024 ఉత్సవం అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరిగింది. సౌత్ టూ నార్త్ సినీ తారలతో ఐఫా వేదిక అబ్బురపరిచింది. ఈ స్టార్ స్టడెడ్ ఈవెంట్ లో మణిరత్నం, సమంతా రూత్ ప్రభు, చిరంజీవి, AR రెహమాన్, వెంకటేష్ , నందమూరి బాలకృష్ణ, కీర్తి సురేష్ , రకుల్ , నాని వంటి సౌత్ స్టార్స్ తో పాటు.. బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, కృతి సనన్, అనన్య పాండే, ఐశ్వర్యారాయ్, విక్కి కౌశల్ పలువురు సందడి చేశారు.
''ఊ అంటావా మావా..ఊ ఊ అంటావా'' పాటకు షారుక్ స్టెప్పులు
ఈ వేడుకలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తన డాన్స్ మూవ్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. షారుక్.. విక్కీ కౌశల్ తో కలిసి ''ఊ అంటావా మావా..ఊ ఊ అంటావా'' పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పాటు షారుక్ “తౌబా తౌబా”కి , "మేరే మెహబూబ్ మేరే సనమ్", "ఝూమే జో పఠాన్" వంటి బాలీవుడ్ సూపర్ హిట్ పాటలకు తనదైన స్టెప్పులతో ఆహుతులలో జోష్ నింపారు. ఇది ఇలా ఉంటే షారుక్ జవాన్ ' సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Yeh tho asli FIRE hey 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024
KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE 🔥😄 pic.twitter.com/bpqUL40hgk
IIFA అవార్డ్స్ 2024 వేడుకలో తొలి రోజు సౌత్ సినిమాలకు, నటీనటులకు అవార్డులు ప్రదానం చేయగా.. రెండవ రోజు బాలీవుడ్ సినిమాలకు, నటీ నటులకు అవార్డులు అందించారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని సత్తా చాటింది. ఉత్తమ విలన్ గా బాబీ డియోల్, ఉత్తమ సహాయ నటుడిగా అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు.
Also Read: ఐఫా అవార్డ్స్ లో 'యానిమల్' హవా.. ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు