/rtv/media/media_files/2025/09/22/ranbir-kapoor-2025-09-22-16-48-28.jpg)
బాలీవుడ్ స్టార్ హీరో, రణ్‌బీర్ కపూర్‌కు కొత్త వివాదం ఎదురైంది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌లో ఆయన ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతున్నట్లు కనిపించిన సన్నివేశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశం నిషేధిత వస్తువును ప్రోత్సహించేలా ఉందని, యువతపై తప్పుడు ప్రభావాన్ని చూపుతుందని ఓ ఫిర్యాదురావడంతోNHRC స్పందించింది.
NHRC seeks Action Taken Report from I&B Ministry & Mumbai Police over Netflix’s ‘Ba*ds of Bollywood’. Ranbir Kapoor shown using a banned e-cigarette without warnings, complaint says it misleads youth. #BadsOfBollywoodReview#ranbirkapoor#nhrc#netflixpic.twitter.com/3Ej7xWdTfI
— Amit Shukla (@amitshukla29) September 22, 2025
NHRC చర్యలు:
ముంబైలోని వినయ్ జోషి అనే వ్యక్తి ఈ సినిమాలోని వీపింగ్ సీన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 2019లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం ప్రకారం, ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, నిల్వ, పంపిణీ మరియు ప్రకటనలు చేయడం నేరం. అయితే, ఈ వెబ్ సిరీస్‌లో రణబీర్ కపూర్ ఎటువంటి హెచ్చరికలు లేకుండా వేపింగ్ చేస్తున్నట్లు చూపించడంపై ఫిర్యాదుదారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చట్ట ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు.
National Human Rights Commission (NHRC) has sought an Action Taken Report from the Information and Broadcasting Ministry and Mumbai Police over a complaint against Netflix's web series 'Ba***ds of Bollywood'. The complainant alleged actor Ranbir Kapoor was shown using a banned… pic.twitter.com/rHMn4f6hbJ
— IANS (@ians_india) September 22, 2025
దీనిపై స్పందించిన NHRCరణబీర్ కపూర్, వెబ్ సిరీస్ నిర్మాతలు, అలాగే నెట్‌ఫ్లిక్స్‌పై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కూడా ఆదేశించింది. ఇలాంటి కంటెంట్ యువతను తప్పుదోవ పట్టించకుండా, తక్షణమే నిషేధించాలని కూడా NHRC కోరింది.