Hombole Films: కేజీఎఫ్, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబోలే ఫిల్మ్(hombale-films) సంచలన ప్రకటన చేసింది. క్లీమ్ ప్రొడక్షన్స్ తో కలిసి 'మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్' అనే భారీ యానిమేటెడ్ సీరీస్ ను రూపొందిస్తున్నట్లు తెలిపింది. శ్రీ మహావిష్ణువు పది అవతారాల ఆధారంగా రూపొందనున్న ఈ సీరీస్ మొత్తం 7 భాగాలుగా రానున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ దాదాపు పదేళ్ళ పాటు కొనసాగుతుంది.
రెండేళ్లకు ఒకటి
రెండేళ్లకు ఒకటి చొప్పున ఈ సీరీస్ లు విడుదల కానున్నాయి. ఇందులో లో మొదటి భాగమైన 'మహా అవతార్ నరసింహ'(Mahavatar Narsimha) జులై 25న విడుదల కానుంది. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 3D ఫార్మాట్ లో ప్రపంచవ్యాప్తంగా ఐదు భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
సినిమా, సీరీస్ రూపంలోనే కాకుండా 'మహా అవతార్' ప్రపంచాన్ని కామిక్స్, వీడియో గేమ్స్, డిజిటల్ స్టోరీటెల్లింగ్, కలెక్టబుల్స్ వంటి వివిధ ఫార్మట్స్ లోకి కూడా విస్తరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ పౌరాణిక కథలను ఆధునిక యానిమేషన్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయాలనేది ఈ 'మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్' ప్రధాన లక్ష్యమని మేకర్స్ తెలిపారు. ఏడేళ్ల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
సిరీస్ ల ప్రణాళిక
- మహా అవతార్ నరసింహ (2025)
- మహా అవతార్ పరశురామ్ (2027)
- మహా అవతార్ రఘునందన్ (2029)
- మహా అవతార్ ద్వారకాధీశ్ (2031)
- మహా అవతార్ గోకులానంద (2033)
- మహా అవతార్ కల్కి పార్ట్ 1 (2035)
- మహా అవతార్ కల్కి పార్ట్ 2 (2037)
దీంతో పాటు ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ రిషబ్ శెట్టి 'కాంతారా2' , ప్రభాస్ 'సలార్' పార్ట్ 2 వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అలాగే రక్షిత్ శెట్టి హీరోగా రిచర్డ్ ఆంటోనీ చిత్రాన్ని కూడా రూపొందిస్తోంది.
Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్