/rtv/media/media_files/2025/08/21/ssmb-29-updates-2025-08-21-17-07-40.jpg)
SSMB 29 Updates
SSMB 29 Updates: దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) - సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం SSMB29పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా రేంజ్ ని ఆకాశానికి ఎత్తేసిన బాహుబలి, RRR వంటి చిత్రాలతో SS రాజమౌళి గారు భారతీయ సినిమా ప్రపంచాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి కొత్త ప్రాజెక్టు SSMB 29తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడానికి సిద్ధమవుతున్నారు..
SSMB29 ఒక గ్లోబ్‑ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. జంగిల్ నేపథ్యం, భారీ VFX, అన్ని కలిపిన కథ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే రాజమౌళి తన గత సినిమాల లాగానే అంతా సైలెంట్ గా షూటింగ్ నడుపుతున్నారు. సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, ఫస్ట్ లుక్, మీడియా సమావేశాలు జరగలేదు, మహేష్ బాబు 50వ పుట్టినరోజున “Globetrotter” అనే పేరుతో ఒక పోస్టర్ వదిలి చిన్న హింట్ ఇచ్చారు.
Also Read: పండగ వేళ మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్.. SSMB29 ఫస్ట్ లుక్ వచ్చేసింది!
ఆ పోస్టర్ లో మహేష్ కస్ట్యూమ్, క్యారెక్టర్, VFX లకు సంబందించిన సమాచారం అందించినప్పటికీ, పూర్తి వివరాలు నవంబర్ లో తెలుపుతాం అని అన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా రహస్యంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన అప్డేట్‌లు రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను నవంబర్ 2025లో రిలీజ్ చేయబోతున్నట్టు గతంలో రాజమౌళి తెలియజేశారు. అయితే నవంబర్ లోనే ఎందుకు అనౌన్స్ చేస్తున్నారన్న దానికి ఇప్పుడు సరైన కారణం బయటకు వచ్చింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్(James Cameron) చేతుల మీదగానే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారని సమాచారం.
JAMES CAMERON for #SSMB29 🌎🥵
— SINGLE SoftwareLover (@champadaal9115) August 21, 2025
👉If That is Going to Happen....????
👉Hype 📈📈.... Sky is the limit🔥💥#GlobeTrotter#MaheshBabu𓃵#JamesCameronpic.twitter.com/QqQ7DVMiWX
నవంబర్‌లో SSMB29 టైటిల్, ఫస్ట్ లుక్..
ప్రస్తుతం జేమ్స్ కామెరాన్ తన తాజా చిత్రం Avatar 3: The Fire and Ash పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన నవంబర్‌లో ఇండియాకు రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్బంగా ఆయన ఇండియాలో నిర్వహించే ఓ ప్రత్యేక ఈవెంట్‌లో SSMB29 ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేయబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే, ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ఇంటర్నేషనల్ లెవల్‌లో హైప్ క్రియేట్ చేయడం ఖాయం.
ఇదే కాకుండా, గతంలో RRR సినిమాకు సంబంధించిన ఓ అవార్డు ఈవెంట్‌లో జేమ్స్ కామెరాన్, రాజమౌళిని భేటీ అయ్యారు. RRR సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ కామెరాన్ మెచ్చుకున్న విషయం తెలిసిందే. “మీరు ఎప్పుడైనా హాలీవుడ్‌లో సినిమా తీయాలని అనుకుంటే, మాతో మాట్లాడండి” అంటూ కామెరాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతే కాదు, వీరిద్దరి మధ్య వీడియో ఇంటరాక్షన్ కూడా జరిగింది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు ఈ సంబంధం SSMB 29 సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ రానుందని అందరూ భావిస్తున్నారు. అన్ని వర్క్ అవుట్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అంతర్జాతీయ గుర్తింపు పొందే మరో సినిమా SSMB 29 రూపంలో రాబోతోందన్నమాట.