/rtv/media/media_files/2025/09/19/weapons-horror-ott-2025-09-19-10-16-20.jpg)
Weapons Horror OTT
Weapons Horror OTT: హాలీవుడ్లో ఎన్నో ప్రశంసలు అందుకున్న "Weapons" అనే సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్(Best Hollywood Horror Movie) ఇప్పుడు భారతీయ ఓటిటీలో విడుదలైంది. జాక్ క్రెగ్గర్ (Zach Cregger) దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇప్పటికే అమెరికాలో పెద్ద విజయం సాధించింది. థియేటర్లలో భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటీలో విడుదలయ్యింది.
Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే, ఇది OTT సబ్‌స్క్రిప్షన్‌తో చూడలేం. సినిమా చూడాలంటే ప్రేక్షకులు రూ. 499 చెల్లించాలి. దీనికి తోడు, ఈ సినిమా తెలుగు సహా ఎలాంటి భారతీయ భాషల్లోనూ డబ్ కాలేదు.
ఇంకొక ప్రత్యామ్నాయంగా, మీరు BookMyShow Stream (BMS Stream) ద్వారా కూడా ఈ సినిమాను చూడొచ్చు. కానీ అక్కడ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి రూ. 549కి రెంట్ చేయవచ్చు, లేదా రూ. 799కి కొనుగోలు చేయవచ్చు.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?
కథలోకి వెళితే…
"Weapons" కథా నేపథ్యం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఓ ప్రశాంత గ్రామం. ఓ రోజు రాత్రి కాగా 2:17 AM కి, ఒకే తరగతిలోని 17 మంది విద్యార్థులు ఒక్కసారిగా కనిపించకుండా పోతారు. వారిలో ఒక బాలుడు మాత్రమే మిగిలిపోతాడు అతని పేరు అలెక్స్. ఈ కథ మొత్తం ఆరుగురు వ్యక్తుల దృష్టికోణాల ద్వారా నడుస్తుంది. ఒక్కొక్కరి కోణం కథలో కొత్త ట్విస్టులు తెస్తూ, చివరికి అంతం ఒక్కరికి చేరుతుంది.. అలెక్స్‌కి!
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్
గూస్ బంప్స్ ఇచ్చే హారర్ ఎలిమెంట్స్
ఈ సినిమాలో పిల్లలు అర్ధరాత్రి తమ ఇళ్ల నుంచి మతిస్థిమితం లేకుండా, నడిచేస్తూ బయటికి వస్తారు. కొందరు బట్టలు కూడా మార్చుకోరు, కొంత మంది బేర్ ఫుట్‌గానే నడుస్తుంటారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒకే వైపుగా నడుస్తుండడం చూడడానికి చాల భయంకరంగా ఉంటుంది. కథలో ప్రతి క్లూ కొత్త అనుమానాలకు దారి తీస్తుంది, అదే సినిమాకి హైలైట్.
ఈ సినిమాలో జూలియా గార్నర్ (Justine Gandy అనే టీచర్ పాత్రలో), జోష్ బ్రోలిన్ (తండ్రి పాత్రలో), బెనెడిక్ట్ వాంగ్ (ప్రిన్సిపల్‌గా), ఆల్డెన్ ఎహ్రెన్‌రైచ్, ఆస్టిన్ అబ్రమ్స్, క్యారీ క్రిస్టఫర్ (తప్పిపోయిన పిల్లవాడిగా) ముఖ్య పాత్రల్లో నటించారు.
బాక్సాఫీస్ హిట్..
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే $230 మిలియన్ వసూళ్లు సాధించింది. 2025లో విడుదలైన బెస్ట్ హారర్ థ్రిల్లర్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది. థియేటర్‌లో మిస్ చేసినవారు ఇప్పుడు ఈ సినిమాను ఇంట్లో కూర్చొని చూస్తూ థ్రిల్ అవ్వొచ్చు.
"Weapons" ఒక భిన్నమైన కథా తంత్రంతో, హారర్‌తో పాటు మిస్టరీని కలిపిన అద్భుతమైన చిత్రం. భారతీయ భాషల్లో ఇది విడుదల కాలేకపోయినా, వాస్తవానికి ఇది ఇంటర్నేషనల్ హారర్ సినిమాల్ని ప్రేమించే ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రం. ఓ మంచి కథ, ఊహించని ట్విస్టులు, సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోరుకునే వారికీ ఇది బెస్ట్ సినిమా.
Follow Us