Nidhhi Agerwal: ప్రస్తుతం కెరీర్ లో వరుస సినిమాల చేస్తూ బిజీగా దూసుకెళ్తోంది యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. ఓ వైపు ప్రభాస్, మరోవైపు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పవర్ స్టార్ సరసన హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో తన ఇమేజ్ ను మరింత పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
ఆ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదు..
అయితే ఇటీవలే 'రాజాసాబ్' సినిమా నుంచి నిధి అగర్వాల్ లుక్ లీక్ అంటూ ఓ ఫొటో నెట్టింట తెగ వైరలైంది. దీంతో వెంటనే నిధి అగర్వాల్ ఎలర్ట్ అయింది. ఆ ఫొటోపై వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ స్టిల్కు 'రాజాసాబ్' సినిమాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓ యాడ్ షూట్ లో భాగంగా తీసిన ఫొటోల నుంచి ఆ స్టిల్ లీక్ అయినట్లు క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి.
Also Read: బిగ్ ట్విస్ట్! 20 లక్షల సూట్ కేస్‌తో అవినాష్ అవుట్? మిడ్‌వీక్ ఎలిమినేషన్
/rtv/media/media_files/2024/12/20/pUw03TTmhRnMo7IgM67W.png)
డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇటీవలే ప్రభాస్ మూవీ షూటింగ్ లో గాయపడడంతో సినిమా వాయిదా వేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రభాస్ సర్జరీ కోసం ఇటలీ వెళ్లి.. జనవరి ఎండింగ్ లో ఇండియాకు రిటర్న్ అవుతారట. కావున అప్పటిదాకా 'రాజా సాబ్' షూటింగ్ జరగదని టాక్.
Also Read: భర్తతో జ్యోతక్క బాలీ ట్రిప్.. సోషల్ మీడియాలో ఫొటోలతో సందడి