/rtv/media/media_files/2025/08/09/hbd-super-star-mahesh-babu-2025-08-09-09-11-19.jpg)
HBD Super star Mahesh Babu
HBD Super star Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్, గ్రేస్, పెర్ఫార్మెన్స్ అన్నింటినీ కలగలిపిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. చిన్నతనం నుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన సినీ ప్రయాణం ఈరోజు వరకు ఒక సూపర్ స్టార్‌గానే కొనసాగుతోంది. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు తన 50వ పుట్టిన రోజు వేడుకలు(Mahesh Babu Birthday) జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/09/happy-birthday-mahesh-babu-2025-08-09-09-20-14.jpg)
బాల నటుడిగా మహేష్ బాబు సినీ ప్రయాణం..
మహేష్ బాబు తండ్రి, ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ గారి ప్రభావంతో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు. మొదటిసారిగా 1979లో వచ్చిన 'నీడ' అనే సినిమాలో నాలుగేళ్ల వయస్సులో కనిపించారు. ఆ తర్వాత వరుసగా తన తండ్రి సినిమాల్లో బాల నటుడిగా ఎన్నో ముఖ్యమైన పాత్రలు పోషించారు.
Also Read: పవన్, మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే థియేటర్‌లో రెండు ట్రీట్‌లు!
బాల నటుడిగా నటించిన సినిమాలు ఇవే:
1. నీడ (1979) – తొలి సినిమా
2. పోరాటం (1983)
3. శంఖారావం (1987)
4. బజార్ రౌడీ (1988)
5. ముగురు కొడుకులు (1988)
6. గూఢచారి 117 (1989)
7. కొడుకు దిద్దిన కాపురం (1989)
8. బాలచంద్రుడు (1990) - బాల నటుడిగా గొప్ప గుర్తింపు వచ్చిన సినిమా
9. అన్నగారు (1995) - బాల నటుడిగా చివరి చిత్రాల్లో ఒకటి.
ఈ చిత్రాల్లో మహేష్ తన నటనా ప్రతిభను చూపించి సినీ చిత్ర పరిశ్రమలో తన ఎదుగుదలకు బలమైన పునాది వేసుకున్నారు.
హీరోగా మహేష్ బాబు ప్రయాణం:
1999లో 'రాజా కుమారుడు' అనే చిత్రంతో తొలిసారి హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు, తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాతి సినిమాలన్నీ ఆయనను సూపర్ స్టార్ గా మార్చి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాయి.
Also Read: వామ్మో! ఒక్క టీ- షర్ట్ ధర అన్ని లక్షలా.. అక్కినేని రిషెప్షన్ లో మహేష్ లుక్ వైరల్
హీరోగా మహేష్ నటించిన సినిమాలు ఇవే:
1. రాజా కుమారుడు (1999)
2. యువరాజు (2000)
3. వంశీ (2000)
4. మురారి (2001)
5. టక్కరి దొంగ (2002)
6. బాబీ (2002)
7. ఒక్కడు (2003)
8. నిజం (2003)
9. నాని (2004)
10. అర్జున్ (2004)
11. అతాడు (2005)
12. పోకిరి (2006)
13. సైనికుడు (2006)
14. అతిధి (2007)
15. ఖలేజా (2010)
16. దూకుడు (2011)
17. బిజినెస్ మాన్ (2012)
18. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
19. 1: నేనొక్కడినే (2014)
20. ఆగడు (2014)
21. శ్రీమంతుడు (2015)
22. బ్రహ్మోత్సవం (2016)
23. స్పైడర్ (2017)
24. భరత్ అనే నేను (2018)
25. మహర్షి (2019)
26. సరిలేరు నీకెవ్వరు (2020)
27. సర్కారు వారి పాట (2022)
28. గుంటూరు కారం (2024)
మహేష్ బాబు హిట్స్ అండ్ ఫ్లాప్స్.. Mahesh Babu Hits and Flops
1999లో, మహేష్ బాబు హీరోగా తన సినీ ప్రయాణాన్ని ‘రాజా కుమారుడు’ చిత్రంతో ప్రారంభించిన మహేష్ కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను హిందీ, తమిళ భాషలలోకి డబ్ చేసి రిలీజ్ చేయగా, ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. దింతో మొదటి చిత్రం తొనే సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు.
2000లో, ఆయన రెండవ సినిమా ‘యువరాజు’ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రిలీజై హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘వంశీ’ సినిమా బి. గోపాల్ దర్శకత్వంలో ఫ్లాప్ గా నిలిచింది.
2001లో, ‘మురారి’ అనే క్లాసిక్ హిట్‌తో మహేష్ బాబు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు.
2002లో, జయంత్ సి. పరంజీ దర్శకత్వంలో వచ్చిన ‘టక్కరి దొంగ’ సినిమాకు మంచి స్పందన లభించగా, శోభన్ దర్శకత్వం వహించిన ‘బాబీ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.
2003లో, గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ మహేష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇది సూపర్ హిట్ కాగా, అదే సంవత్సరం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నిజం’ సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
2004లో, ఎస్.జె. సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు ‘నాని’ సినిమాలో డ్యూయల్ రోల్ కనిపించారు, ఈ చిత్రం మాత్రం డిజాస్టర్. అదే ఏడాది గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్’ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.
2005లో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
2006లో, మహేష్ కెరీర్‌లో మరొక మెగా హిట్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘పోకిరి’ వచ్చింది, అదే ఏడాది గుణ శేఖర్ తీసిన ‘సైనికుడు’ భారీగా ఫెయిల్ అయ్యింది.
2007లో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అతిధి’ కూడా పర్వాలేదనిపించుకుంది.
2010లో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.
2011లో, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ మహేష్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
2012లో, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్ మాన్’ కూడా మంచి హిట్ సాధించింది.
2013లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ అయ్యింది.
2014లో, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1: నేనొక్కడినే’ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోగా, అదే సంవత్సరం శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు’ పూర్తిగా ఫెయిల్ అయ్యింది.
2015లో, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది.
2016లో, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.
2017లో, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ హిట్‌గా నిలిచింది.
2018లో, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను’ మహేష్ బాబుకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ తీసుకొచ్చింది. ఆయన ఇందులో ఒక ముఖ్యమంత్రి పాత్రలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు. ఇక 2019 లో వచ్చిన మహర్షి పర్వాలేదు అనిపించుకున్నా.. 2020, 2022 లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట మంచి విజయాలను సాధించాయి. అయితే మహేష్ చివరిగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తీసిన 'గుంటూరు కారం' మాత్రం ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేసింది. దీంతో మహేష్ అభిమానుల ఆశలన్నీ రాజమౌళి తీయబోయే SSMB 29 పైనే ఉన్నాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/09/mahesh-babu-birthday-special-2025-08-09-09-21-16.jpg)
మహేష్ బాబు గెలుచుకున్న అవార్డులు
జాతీయ అవార్డులు: 00
నంది అవార్డులు: 08
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: 05
SIIMA అవార్డులు: 03
IIFA అవార్డులు: 01
సినీమా అవార్డులు: 03
సాక్షి అవార్డులు: 01
సంతోషం ఫిల్మ్ అవార్డులు: 02
మహేష్ బాబు గురించి కొన్ని తెలియని నిజాలు..
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, హీరోగా కాకముందే చిన్నప్పటినుంచే ఆయన 9 సినిమాల్లో బాల నటుడిగా నటించారు. హీరోగా పరిచయం అయ్యాక ఎంత బిజీ స్టార్ అయినప్పటికీ, మహేష్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా శ్రద్ధగా ఎంచుకుంటారు. ఇది ఆయన హిట్ రేషియోకి ముఖ్య కారణం. శ్రీమంతుడు మాదిరిగా నిజ జీవితంలోనూ మహేష్ ఒక గొప్ప ఫిలంత్రఫిస్ట్ Heal-a-Child, Rainbow Hospitals, Mahesh Babu Foundation వంటి సంస్థలకు మద్దతుగా నిలిచారు. ఎంతో మంది గుండె జబ్బులతో బాధ పడుతున్న చిన్నారులకు జీవితాన్ని అందించారు. 2005లో నమ్రత శిరోద్కర్‌ను ప్రేమ వివాహంగా చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు - గౌతమ్, సితార. AMB Cinemas, GMB Entertainment ద్వారా సినిమాల నిర్మాణం చేస్తున్నారు. అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్ కూడా వ్యవహరిస్తున్నారు.
వేలాది గుండెల చప్పుడు మహేష్ బాబు..
టాలీవుడ్‌లో స్టార్‌డమ్ అంటే కేవలం హిట్లు, ఫ్యాన్స్, ఫాలోయింగ్ మాత్రమే కాదు. మానవతా విలువలు కలిగిన వ్యక్తిత్వమే నిజమైన గొప్పతనం. ఈ మాటకు నిలువెత్తు రూపం మహేష్ బాబు. వెండితెరపై ఎంతగా మెరిస్తారో, నిజజీవితంలో కూడా ఆయన అంతే ఎదిగాడు. నటుడిగా ఆయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నా, ఒక మానవతావాదిగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి.
మహేష్ బాబు స్థాపించిన మహేష్ బాబు ఫౌండేషన్ ఆద్వర్యంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 4,500కు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు జరిపించడం ద్వారా వారి ప్రాణాలను నిలబెట్టి మానవత్వం గల ఈ నటుడుగా తన గొప్ప తనాన్ని చాటుకున్నారు.
చిన్నారుల తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వులు తెచ్చే విధంగా అనేక వైద్య సేవలను అందిస్తూ. ఎంతో మంది పేద చిన్నారులకు ఆరోగ్యవంతంగా జీవించేందుకు మార్గం చూపుతున్న మహేష్, వారి కుటుంబాలలో ఒక కొత్త ఆశ జ్యోతిని నింపారు. ఒక్కో ఆపరేషన్ వల్ల ఓ కుటుంబం జీవితమే మారిపోతుందని మహేష్ అర్థం చేసుకున్నాడు.
ఇక సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్ల నుంచి రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అనే కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు, నమ్రతలను ప్రశంసలతో ముంచెత్తారు. ఒక స్టార్ నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు రావడం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
"సినిమాలు నా ప్యాషన్ అయితే, సేవలు నా బాధ్యత" అనే సిద్ధాంతంతో జీవించే మహేష్, కొత్త తరం నటులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
మంచి కథానాయకుడిగా మాత్రమే కాదు, మంచి మనిషిగా మహేష్ బాబు వేలాది కుటుంబాల్లో వెలుగును నింపారు. నిజమైన స్టార్ అనిపించుకోవడానికి హిట్ సినిమాలు అవసరం లేదు - హృదయాలను గెలవడమే చాలు. ఈ విషయాన్ని మహేష్ బాబు నిరూపించారు.
Also Read: SSMB 29 సెట్ లో మొక్కలు నాటుతూ మహేష్.. వైరల్ అవుతోన్న న్యూ లుక్..!
SSMB 29..
టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా ఇంతటి గొప్ప స్థానం సంపాదించుకున్న ఘట్టమనేని మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అంత క్రేజ్ ఉన్న సినిమా SSMB 29.
స్పెషల్ సర్ప్రైజ్..! Mahesh Babu Birthday Special
అయితే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఎలాంటి అప్డేట్(SSMB Update) రాకపోవచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ మాత్రం రెడీగా ఉందని తెలుస్తోంది. ఆగస్ట్ 9న ఉదయం 11:17 గంటలకు ఒక కీలకమైన అనౌన్స్మెంట్ రానుందని టాక్.
ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదుగానీ, మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సినీ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. డాన్స్, పర్ఫార్మెన్స్, సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉండే సితార ఇప్పటికే ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అలాగే త్వరలో వెండితెరపై అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారట సితార.
అయితే, మహేష్ పుట్టినరోజు సందర్భంగా సితార మొదటి సినిమా గురించి అధికారికంగా అనౌన్స్మెంట్ రాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు స్వయంగా ఈ అప్డేట్‌ను షేర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది నిజమైతే, ఇది ఘట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు డబుల్ సెలబ్రేషన్ అని చెప్పొచ్చు!
సితార గ్రాండ్ ఎంట్రీపై ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. "తండ్రిలా కూతురు కూడా మంచి పేరు సంపాదించి సిల్వర్ స్క్రీన్ పై మెరవాలని" ఆశిస్తూ, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ తన కెరీర్‌లో డెబ్యూ చేసిన విధంగా, సితార కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
ఇక ఎస్ఎస్ఎంబీ 29 విషయానికొస్తే రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతుండటంతో, మహేష్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయి కానుంది. సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉండబోతోందో, కథ ఎలా ఉంటుందో అనే విషయాలపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
దీంతో ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు చాలా ప్రత్యేకం కానుంది. ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్ రాకపోయినా, సితార ఎంట్రీ అనౌన్సమెంట్ రూపంలో ఫ్యాన్స్‌కు గిప్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 11:17 గంటలకు మరి ఈ సర్ప్రైజ్ రివీల్ అవుతుందో లేదో చూడాలి.
అభిమానుల కోసం..
ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజున ఆయన ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని సేవా రూపంలో చూపుతారు. అలాగే సోషల్ మీడియా టెండింగ్ మొత్తం ఆయన పేరు మీదే ఉంటుంది!
చిన్నతనంలో బాల నటుడిగా మొదలైన మహేష్ బాబు సినీ ప్రయాణం ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న టాప్ హీరోగా ఎదిగింది. ఆయన నమ్మే సిద్ధాంతాలు, శ్రమ, నటన అన్నీ యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.
ఈ పుట్టినరోజున మానవతా విలువలు కలిగిన ఈ సూపర్ స్టార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!