/rtv/media/media_files/2025/07/31/hari-hara-veera-mallu-ott-1-2025-07-31-15-05-32.jpg)
Hari Hara Veera Mallu ott (1)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ విమర్శకుల, ప్రేక్షకుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కలెక్షన్లపై భారం పడింది. మొదటి రోజు, ప్రీమియర్ షోలతో కలిపి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
Also Read:బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు
Hari Hara Veera Mallu Ott Date
ప్రీమియర్ షోలకు తెలుగు వెర్షన్‌లో రూ.12.75 కోట్లు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో డే 1 రోజున అన్ని భాషల్లో రూ.34.75 కోట్లు వచ్చాయి. ఇలా మొదటి 5 రోజుల్లో సుమారు రూ.75 కోట్లు (ఇండియా నెట్ కలెక్షన్స్) వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫస్ట్ డే తర్వాత ఈ మూవీ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై భారం పడింది.
ముఖ్యంగా ఈ మూవీలో పవన్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలంగా నిలిచింది. అదే సమయంలో ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ అద్భుతంగా ఉంది. అదే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసి ప్రశంసలు అందుకుంది. ఇందులో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Pawan Kalyan's film "Hari Hara Veera Mallu," released July 24, 2025, underperformed at the box office and is reportedly heading for an early OTT release on Amazon Prime Video around August 22. #HHVM#OTT#PrimeVideopic.twitter.com/CqW6MLzo7h
— Snooper-Scope (@Snooper_Scope) July 31, 2025
అయితే సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సినిమాకు అత్యంత మైనస్‌గా నిలిచాయి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో గ్రాఫిక్స్ క్వాలిటీ దిగజారిపోయింది. దీంతో ఈ మూవీపై ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. సినిమాలోని గుర్రపు స్వారీ సన్నివేశాలు, సీజీఐ యానిమల్స్ పై ఘోరంగా ట్రోల్స్ చేశారు. కథనం కూడా స్థిరంగా లేదని.. అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే సినిమా మైనస్ అయిందంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
Also Read:‘కింగ్డమ్’ మూవీ హిట్టా? ఫట్టా?.. అదిరిపోయిన రివ్యూ
సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ మాత్రం అందరినీ నిరాశపరిచిందని ప్రేక్షకులు తెలిపారు. మొత్తం ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ.. థియేటర్ వద్ద నిరాశపరిచింది. ‘హరిహర వీరమల్లు’ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఇది పవన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం పెద్దగా రానట్లు తెలుస్తోంది.
#MovieNews : #HariHaraVeeraMallu ⚔️ Set to Stream from AUGUST 22nd on Prime Video 🎬
— Madhuri Daksha (News Presenter) (@MadhuriDaksha) July 31, 2025
Available in Telugu, Tamil, Hindi, Malayalam & Kannada 🔥🏹⚓#HariHaraVeeraMalluOnPrime ❤️#PawanKalyan#HHVM#OTT#PSPK#TeluguNews#News#Telugu#TFI#TeluguFilmIndustry#PrimeVideopic.twitter.com/VOrTZyNG2p
ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయిన 4 నుండి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందని అంచనా. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. వాటి ప్రకారం.. ఆగస్టు 22వ తేదీన అంటే చిరంజీవి పుట్టినరోజున ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక అనౌన్స్‌మెంట్ రానుంది.