/rtv/media/media_files/2025/01/14/U6rkzFotzPddkVL4FkiM.jpg)
Hari Hara Veera Mallu Photograph: (Hari Hara Veera Mallu)
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా ఈ మూవీకి సంబంధించి అప్డే్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాడిన మాట వినాలి అనే ప్రోమోపాటను రిలీజ్ చేశారు. వీరమల్లు మాట చెబితే వినాలి.. అంటూ పవన్ గొంతు ఇప్పుడు ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. ఫుల్ సాంగ్ ను జనవరి 17న ఉదయం 10 : 20 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
Also Read : తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?
Beginning the Musical Storm 🎵🌪#HariHaraVeeraMallu 1st Single Promo Out Now 💥#MaataVinaali (Telugu) - https://t.co/ebgZz9mHPY
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 14, 2025
Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎶🎤
A @mmkeeravaani Musical 🎹
Lyrics by 📝 #PenchalDas
Full song out on 17th Jan at… pic.twitter.com/uTVru2szqg
సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా.
చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తు్ండగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను 2025 మార్చి 28న హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో పవన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్రం కోసం ఓ యోధుడుగా కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ పక్కకు తప్పుకోవడంతో, జ్యోతి కృష్ణ డైరక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది
Also Read : మోదీ కేబినెట్‌లోకి మెగాస్టార్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే!