/rtv/media/media_files/2025/02/25/d0EkCGSC1NiS8XU7iGOK.jpg)
బాలీవుడ్ నటుడు గోవింద, అతని భార్య సునీతా అహుజా విడాకులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలం విడివిడిగా ఉంటున్నారని.. ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో వీరి 37 సంవత్సరాల వైవాహిక బంధానికి తెరపడనుంది. సునీత ఒక ఇంటర్వ్యూలో తాము ఇద్దరం గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నామని వెల్లడించారు.
సునీత తన పిల్లలతో కలిసి ఫ్లాట్‌లో నివసిస్తుందని సమాచారం. ఓ 30 ఏళ్ల మరాఠి నటితో గోవింద రిలేషన్ షిప్ దీనికి కారణమని తెలుస్తోంది. గోవింద, సునీత 1987 మార్చి 11న వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా ఇద్దరు పిల్లలున్నారు. గోవింద, సునీత ఇద్దరూ చాలా చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సునీతకు కేవలం 18 సంవత్సరాలు.
Grey divorce—separations among older couples—reflects evolving personal priorities, longer life expectancy, and shifting societal norms, as seen in the buzz around Govinda and Sunita Ahuja's rumored split.#Govinda #sunitaahuja #Divorce #Bollywood https://t.co/MVHIUhoLXT
— News18 (@CNNnews18) February 25, 2025
ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌లతో
బాలీవుడ్‌ను కపూర్‌లు, చోప్రాలు, ఖాన్ త్రయం ఏలేస్తున్న టైమ్ లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవింద తనదైన సినిమాలతో ఆకట్టుకుని ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నాడు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు యాక్షన్ సినిమాలు చేస్తుంటే గోవింద మాత్రం ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 1986లో లవ్ 86 మూవీ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన గోవింద.. నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. 2000 సంవత్సరం తరువాత అతని సినిమాలు తగ్గుకుంటూ వచ్చాయి. సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేసిన ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు.
Also Read : Preity Zinta : ప్రీతి జింటాకు రూ.18 కోట్ల రుణం మాఫీ.. కాంగ్రెస్ పై హీరోయిన్ ఫైర్!