Preity Zinta : ప్రీతి జింటాకు రూ.18 కోట్ల రుణం మాఫీ.. కాంగ్రెస్ పై హీరోయిన్ ఫైర్!

న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో  ప్రీతి జింటా తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందంటూ ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా పోస్టుపెట్టగా దీనిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడింది. ఓ రాజకీయ ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సిగ్గు చేటని మండిపడింది.

New Update
preity zinta

న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లో రూ. 18 కోట్ల లోన్ విషయంలో మోసానికి పాల్పడ్డారంటూ కేరళ  కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణలపై బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్పందించారు.  ఓ రాజకీయ ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.  పదేళ్ల క్రితమే తాను లోన్ తీసుకుని తిరిగి చెల్లించినట్టుగా ఆమె స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని  సూచించారు. 

ఇక తన సోషల్ మీడియా అకౌంట్లను తానే హ్యాండిల్ చేస్తానని వెల్లడించారు.  కాగా న్యూఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌లో  ప్రీతి జింటా తీసుకున్న రూ.18 కోట్ల రుణం మాఫీ అయ్యిందంటూ ఆరోపిస్తూ కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా  పోస్టు పెట్టింది.  గత వారం ఆ బ్యాంకును మూసేయడంతో డిపాజిటర్లు రోడ్డునపడ్డారని ఆరోపించింది.  దీనిపై ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ  తీవ్రస్థాయిలో మండిపడింది. 

పోస్ట్‌ చూసి నేను షాకయ్యా

‘‘ట్విట్టర్ లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోస్ట్‌ చూసి నేను షాకయ్యాను.  నాకోసం ఎవరూ ఏ రుణాన్నీ మాఫీ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ నా పేరును ఉపయోగించి తప్పుడు వార్తలు ఎలా ప్రచారం చేస్తుంది? పదేళ్లక్రితం ఆ బ్యాంకు నుంచి రుణం తీసుకొని.. దానిని కట్టేశాను. విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు. భవిష్యత్తులో ఎటువంటి అపార్థాలు రాకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నాను’’ అంటూ  ప్రీతిజింటా వెల్లడించింది.

Also read :  కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

#bank-loan #kerala #congress #New India Cooperative Bank #Preity Zinta
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు