‘విశ్వం’ ట్రైలర్ అదరహో.. కడుపుబ్బా నవ్వించే సీన్లు హైలైట్

గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘విశ్వం’. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో కడుపుబ్బా నవ్వించే సీన్లు అదిరిపోయాయి.

New Update

Viswam Trailer: మ్యాచో స్టార్ గోపీచంద్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘రామ బాణం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ‘భీమా’ అనే మూవీతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. 

ఇది కూడా చదవండి: ఆదివారం ప్రోమో అదిరింది.. ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్స్! గంగవ్వ కూడా..

దీంతో ఈ సారి ఎలాగైన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ జానర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ అగ్ర బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, దోనేపూడి చక్రపాణి నిర్మిస్తున్నారు. 

ట్రైలర్ రిలీజ్

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఇలా ప్రతీది అంచనాలు పెంచేశాయి. ఇక మేకర్స్ తాజాగా మరో అప్డేట్‌తో సినీ ప్రియుల్లో జోష్ పెంచారు. మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంది. వాడు బార్డర్‌లో టెర్రరిస్టులను నాశనం చేస్తుంటే నేను టెర్రరిస్టులను సృష్టిస్తున్నాను. త్వరలోనే ఇండియాకి దీపావళి రాబోతుంది అంటూ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు కనిపించాయి. 

ఇది కూడా చదవండి: చెల్లి సమంత 'నా సోల్ మేట్'.. శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్

దీంతో ఈ ట్రైలర్ చూస్తుంటే గోపీచంద్ ఈ సారి మంచి హిట్ అందుకోబోతున్నాడని అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్స్ కామెడీ కామెడీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల అంటే అక్టోబర్ 11న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్‌ను రాబడుతుందో చూడాలి.  

#cinema-news #gopichand #gopichands-viswam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe