ఈ దసరాకు మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయింది 'విశ్వం' సినిమా. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. శ్రీనువైట్ల లాంగ్ గ్యాప్ తర్వాత తీసిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
కామెడీ కొంతవరకు వర్కౌట్ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేక పోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. ఇక ఈ దీపావళికి లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. కొత్త సినిమాల రాకతో గత చిత్రాలను థియేటర్స్ నుంచి తొలగిస్తారు. ఆ లిస్టులో మొదట 'విశ్వం' సినిమానే ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట.
Also Read : ఇంట్లో కుమారుడి డెడ్‌బాడీ.. చూపు లేని ఈ తల్లిదండ్రుల బాధ చూస్తే కన్నీళ్లు ఆగవు!
Also Read : 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ
20 రోజుల్లోనే ఓటీటీకి..
అనుకున్న డేట్ కంటే కాస్త త్వరగా ఓటీటీలో విడుదల చేస్తే కొంతైనా సేఫ్ కావచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్ 1న 'విశ్వం' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా?
యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. కావ్యా థాపర్ కథానాయికగా నటించగా.. సీనియర్ నటుడు నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్ తోపాటు షకలక శంకర్, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో కనిపించారు.
Also Read : మరోసారి ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా..?