Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'దేవర' స్పెషల్ షోలకు అనుమతి

‘దేవర’ స్పెషల్‌ షోలకు తెలంగాణసర్కార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మూవీ టీమ్ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జీవోను ఈ రోజు విడుదల చేయనున్నారు.

devara
New Update

Devara Movie :

జూనియర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 'RRR' లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత హైప్ పెంచింది. 

ఇక ఫ్యాన్స్ అయితే సినిమాను బిగ్ స్క్రీన్స్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త చెప్పబోతోంది. ‘దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ‘దేవర’ మూవీ టీమ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

Also Read : 'కంగువా' కు మళ్ళీ కొత్త ముహూర్తం..!

ఇందుకు సంబంధించిన ప్రభుత్వం జీవోను ఈ రోజు విడుదల చేయనున్నారు. తొలిరోజు అర్ధరాత్రి 1గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో దేవర మూవీ స్పెషల్ షోలకు పర్మిషన్ వచ్చిందా? లేదా? అనే దానిపై ఇప్పటివరకైతే ఎలాంటి సమాచారం లేదు. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

#ntr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe