Kanguva Release Date: 'కంగువా' కు మళ్ళీ కొత్త ముహూర్తం..! సూర్య 'కంగువా' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయించిన ఈ చిత్రాన్ని కొన్ని కారణాల చేత వాయిదా వేయగా.. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. By Archana 19 Sep 2024 in సినిమా Short News New Update kanguva షేర్ చేయండి Kanguva Release Date: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కంగువ'. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్రాజా, వంశీ-ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టార్ కాస్ట్ బాబీ డియోలో, దిశా పటానీ, జగపతి బాబు, కిచ్చ సుదీప్, యోగిబాబు తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. కంగువా కొత్త రిలీజ్ డేట్ ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయించిన ఈ చిత్రాన్ని కొన్ని కారణాల చేత వాయిదా వేయగా.. తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే అక్టోబర్ 10న రజినీకాంత్ 'వేట్టయాన్' రిలీజ్ కూడా ఉండడంతో.. ఆయన పై గౌరవంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని ఇటీవలే ఓ కార్యక్రమంలో సూర్య పరోక్షంగా చెప్పారు. అలాగే తన సినిమా ఎప్పుడు వచ్చినా.. ప్రేక్షకులు తప్పకుండా అభిమానం, ప్రేమ చూపిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన 'కంగువా' ట్రైలర్ లో సూర్య, బాబీ డియోల్ విజువల్స్ యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ తోనే మరో సౌత్ ఇండియన్ రికార్డ్ బ్రేకింగ్ ఈ మూవీ ఉండబోతున్నట్లు అర్థమైంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. The Battle of Pride and Glory, for the World to Witness ⚔🔥#Kanguva's mighty reign storms screens from 14-11-24 🤎#KanguvaFromNov14 🦅 @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP #StudioGreen @GnanavelrajaKe @vetrivisuals @supremesundar @UV_Creations… pic.twitter.com/de3yYAL0BI — Studio Green (@StudioGreen2) September 19, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి