శంకర్ డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సుమారు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సోలో హీరోగా చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ అంతా 'గేమ్ ఛేంజర్' కోసం ఎంతో ఆకస్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రిలీజ్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా రామ్ చరణ్ ఓ అరుదైన ఫీట్‌ను అందుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డిసెంబర్ 29న దేశంలోనే అతిపెద్ద రామ్ చరణ్ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. Also Read : గోదారి గట్టు సాంగ్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం! A BIGGEST CUTOUT for an epic CELEBRATION🔥Global Star @AlwaysRamCharan India's Biggest Cutout Launch on December 29th at Vajra Grounds, Brindavan Colony, Vijayawada😎💥RC Fans - The #GameChanger's Game is about to begin💥#GameChangerOnJAN10 🚁🔥 pic.twitter.com/K9OhzxqG5l — Trends RamCharan ™ (@TweetRamCharan) December 20, 2024 250 అడుగుల కటౌట్.. విజయవాడ బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించబోతున్నారు. సుమారు 250 అడుగులు ఉండే ఈ కటౌట్ ఈవెంట్ ను సైతం గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మెగా అభిమానుల సమక్షంలోనే ఈ కటౌట్ ఓపెనింగ్ ఉండబోతోంది. మరోవైపు నేడు అమెరికాలోని డల్లాస్ లో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. Also Read : 'పుష్ప2' ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ.. థియేటర్స్ లో మాత్రమే అంటూ అందుకుగాను ఇప్పటికే రామ్ చరణ్, శంకర్ సహా పలువురు అమెరికా చేరుకున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.