Ram Charan Campa AD: రామ్ చరణ్- 'కాంపా’ బ్రాండ్ సరికొత్త కోలా యాడ్ చూశారా..?

రామ్ చరణ్ 'కాంపా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. మిలీనియల్స్, జెన్ Zను లక్ష్యంగా చేసుకొని ఐపీఎల్ సమయంలో ‘కాంపా వాలి జిద్’ ప్రచార చిత్రం విడుదల కానుంది. ఇది కాంపా బ్రాండ్ విస్తరణలో కీలక అడుగు కావడం విశేషం.

New Update
Ram Charan Campa AD

Ram Charan Campa AD

Ram Charan Campa AD: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రిలయన్స్ గ్రూప్‌కు చెందిన బేవరేజ్స్ ‘కాంపా’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

రామ్ చరణ్‌తో బ్రాండింగ్ ఒప్పందం కుదరడం కాంపా బ్రాండ్ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా మారనుందని రిలయన్స్ తెలియజేసింది. 1970ల నుంచి 80ల మధ్యకాలంలో భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కాంపా కోలా బ్రాండ్‌ను 2022లో రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. ఆపై, 2023 మార్చిలో మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. తక్కువ కాలంలోనే ఈ బ్రాండ్ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్‌

అయితే, కాంపా బ్రాండ్ ప్రస్తుతం విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మిలేనియల్స్, జెన్ Z తరాలను టార్గెట్ చేయాలనే లక్ష్యంతో, పాన్ ఇండియా స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించేందుకు రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది కాంపా బ్రాండ్.

Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!

ఇందులో భాగంగానే, ‘కాంపా వాలి జిద్’ పేరుతో ప్రత్యేకమైన కమర్షియల్‌ను రూపొందించారు. ఈ యాడ్ టీవీలలో, మొబైల్ స్క్రీన్లపై ప్రసారమయ్యే ఐపీఎల్ సీజన్ సందర్భంగా దేశవ్యాప్తంగా విభిన్న భాషల్లో ప్రసారం కానుంది.

Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!

కాంపా తన రీబ్రాండింగ్ ప్రయాణంలో మెరుగైన గుర్తింపు కోసం రామ్ చరణ్‌తో జతకట్టడం ద్వారా మరింత విస్తృతంగా యువతలో క్రేజ్ ఏర్పర్చుకోవాలని భావిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు